2015 ఏ.పి పరిణామాలు

2015 Rewind A.p. News

05:47 PM ON 29th December, 2015 By Mirchi Vilas

2015 Rewind A.p. News

 ఎన్నో మజిలీలతో మంచి చెడుల సమాహారంగా  సాగిన   2015 సంవత్సరం వీడ్కోలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజనతో రాజధాని లేని  రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ 2015లో ఎన్నో పరిణామాలకు  వేదిక గా నిలిచింది.

1/9 Pages

రాజధాని భూమి పూజ - శంఖుస్థాపన ........

 ఎపి రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఉంటుందని చెబుతూ దాదాపు 32వేల ఎకరాలను భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందు ఉగాది నాడు తుళ్ళూరులో వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పలు రంగాల్లో నిష్ణాతులకు పురస్కారాలు అందించింది.  జూన్ 8న రాజధానికి  భూమిపూజ చేసారు. ఆతర్వాత అమరావతి రాజధానిగా ఖరారు చేసారు.   రాజధాని నిర్మాణానికి   ఇంకా భూములు ఇవ్వాల్సిన వాళ్ళను దారికి తెచ్చేందుకు భూ సేకరణ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడంతో జనసేన నేత పవన్ కళ్యాణ్... పెనుమాక,  ఉండవల్లి, తదితర ప్రాంతాల్లో పర్యటించి, రైతుల సమస్యలు తెల్సుకున్నారు. రెండు దఫాలు పర్యటించిన పవన్ రైతులను ఒప్పించి ఏదైనా చేయాలని , అందుకు విరుద్ధంగా చేస్తే , రైతుల పక్షాన పోరాటం చేయడానికి వెనుకాడేది లేదని స్పష్టం చేసినా , ఆ దిశ గా అడుగులు పడలేదు. మొత్తానికి విజయ దశమి  నాడు  ప్రధాని మోడీ చేత రాజధాని నిర్మాణానికి  సిఎమ్ చంద్రబాబు శంఖుస్థాపన కూడా  చేయించారు. ప్రజా రాజధాని అంటూ ఊరూరా మట్టి - నీరు సేకరించి మరీ శంఖుస్థాపన చేసారు. ప్రధాని మోడీ కూడా డిల్లీ నుంచి పార్లమెంట్ మట్టి , యమునా నీటిని అందించి ప్రత్యేక హోదా , ప్రత్యేక ప్యాకేజి ఊసే ఎత్తలేదు.

English summary

This article covers all the major happenings in 2015 including events, happenings, political issues, political news etc.