2015లో ఎపి పోలీస్ ఫెర్ఫార్మెన్స్ ...

2015 Rewind-A.p Police Performance

03:42 PM ON 31st December, 2015 By Mirchi Vilas

2015 Rewind-A.p Police Performance

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఎపిలో పోలీసుల పనితీరు 2015లో బానే వుంది . పైగా 2014తో పోలిస్తే 2015లో నేరాలు 4.23 శాతం తగ్గాయి. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఎపి డిజిపి జెవి రాముడు గురువారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

గోదావరి పుష్కరాలు , ఎపి నూతన రాజధాని అమరావతి శంఖుస్థాపన, నెల్లూరు వరదల సమయంలో సహాయక చర్యల్లో పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారని డిజిపి రాముడు చెప్పారు.

ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోగా , 96 మందిని అరెస్టు చేసారు. 13సార్లు పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

కీలకమైన ఎర్రచందనం కేసుల్లో 2 వేల 710 మందిని అరెస్టు చేసారు. మరో 40 మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసారు. 51 మంది పై పిడి యాక్ట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా విదేశాల్లో వున్న అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డి ని అరెస్టు చేసి , జైలుకి పంపారు.

అయితే ఈ ఏడాది విజయవాడ స్వర్ణ బార్ కల్తీ మద్యం , విజయవాడ కేంద్రంగా కాల్ మనీ వ్యవహారం - దాని చాటున సెక్స్ రాకెట్ కేసుల్లో ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసారు. కాగా చిత్తూరు మేయర్ కటారి అనూరాధ - మోహన్ దంపతుల హత్య కేసులో కీలక నిందితులను పట్టుకుని పురోగతి సాధించారు.

ఎపిలో 250 కాల్ మనీ కేసులు నమోదు

ఇక రాష్ట్రవ్యాప్తంగా 250 కాల్‌మనీ కేసులు నమోదైనట్లు ఎపి హొమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాల్‌మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వైకాపా నేతలు ప్రాంతానికోవిధంగా ద్వందవైరి అవలంభిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

English summary

When Compared To Last year this year the crime rate have been decreased to 4.23 percent in Andhra Pradesh. This said by A.P DGP J.V.Ramudu to media