2015 వరకు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ టెక్ అక్విజిషన్స్ ఇవే..

2015 Rewind Biggest Tech Acquisitions

08:17 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 Rewind Biggest Tech Acquisitions

టెక్నాలజీ.. టెక్నాలజీ.. టెక్నాలజీ.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇదే జపం చేస్తోంది. చిన్న కంపెనీలు.. పెద్ద కంపెనీలు అన్ని దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో టెక్నాలజీ సంస్థలకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ కంపెనీలు తమకంటే చిన్న కంపెనీలను.. లేదా తమతో సమానంగా ఉన్న సంస్థలను కొనుగోలు చేశాయి. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ టెక్నాలజీ సంస్థల కొనుగోళ్లలను ఇప్పుడు చూద్దాం. 2015లో డాలర్ రేటు ఆధారంగా ఈ అక్విజిషన్స్ ను లెక్కించడం జరిగింది. 

అయితే ఈ అక్విజన్ల వల్ల కొన్ని కంపెనీలు లాభపడితే.. కొన్ని మాత్రం దెబ్బతిన్నాయి. కాంపాక్ట్ ను కొనుగోలు వ్యవహారం తదనంతర పరిణామాలతో హెచ్ పీ తన సీఈవోకు ఉద్వాసన ఫలికింది. అలాగే ఈబీఎస్ కొనుగోలు తర్వాత వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. మోటోరోలాను కొనుగోలు చేసిన రెండేళ్లక గూగుల్ దానిని 3 బిలియన్ డాలర్ల నష్టానికి లెనోవోకు అమ్మేసింది. మైక్రోసాఫ్ట్-స్కైప్, ఒరాకిల్-సన్ కొనుగోలులో రెండు సంస్థలకు ఎటుంటి నష్టంకానీ, లాభంకానీ చేకూరలేదు. ఇకపోతే ఫేస్ బుక్-వాట్సాప్ కొనుగోలుపై ఇప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుంది.

చరిత్రలో నిలిచేపోయే స్థాయిలో ఉన్న అతిపెద్ద అక్విజిషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1/10 Pages

ఒరాకిల్ - సన్ మైక్రోసిస్టమ్స్ , రూ. 40వేలకోట్లు

టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ 2009లో సన్ మైక్రోసిస్టమ్స్ ను 8.2బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే ఇది మన భారత కరెన్సీలో ఇప్పటి డాలర్ రేటు ప్రకారం సుమారు 48000కోట్ల రూపాయలతో సమానం. ఈ డీల్తో ఒరాకిల్ సంస్థ హార్డ్ వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతుంది. అప్పటివరకూ ఒరాకిల్ కు ప్రత్యర్ధిగా ఉన్న సన్ మైక్రోసిస్టమ్స్‌ను ఒరాకిల్ కొనేయడంతో ఒరాకిల్ ఆధిపత్యానికి అడ్డే లేకుండా పోయింది. ఈ అక్విజిషన్ పుణ్యమా అని సన్ మైక్రోసిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3000మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాల్సి వచ్చింది. 

 

English summary

Here is the list of biggest tech acquisitions of all time, measured in 2015 dollars.In this list dell is in top position