2015 - హార్ట్‌ టచ్చింగ్‌ సినిమాలు

2015 Rewind-Heart Touching Movies

04:17 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Heart Touching Movies

2015 వ సంవత్సరంలో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో  ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన సినిమాలు తక్కువనే చెప్పాలి. ఈ సంవత్సరం ప్రేక్షకుల మదిని దోచుకున్న కొన్ని సినిమాలను ఇప్పుడు చూద్దాం.

1/6 Pages

1. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

టాలీవుడ్‌ లో ఇటు టాలెంట్‌తో పాటు, అటు సినిమాల పై మంచి టేస్టు ఉన్న హీరో ల్లో శర్వానంద్‌ ఒక్కడు తన ప్రతిసినిమా కూడా డిఫరెంట్‌గా ఉండాలని అనుకుంటాడు. ఓనమాలు సినిమాతో దర్శకుడిగా పరిచమైన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో శర్వానంద్‌, నిత్యామీనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన 'మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు' చిత్రం తెలుగు తెర పై వచ్చిన ఒక స్వచ్ఛమైన ప్రేమాకధగా నిలిచిపోయింది. ఈ స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదు అనే ప్రధాన అంశంగా రూపొందిన ఈ చిత్రం అందరి చేత శభాష్‌ అనిపించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపి మోహన్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్‌ అని చెప్పక తప్పదు.

English summary

Here are list of heart touching movies which were released in 2015. There were films like malli malli idhi raasni rooju, kanche,tungabadhra,yevaday subramanyam,krishnamma kalipindi iddarini movies