12 నెలల్లో  37 దేశాలు చుట్టేసిన మోడీ 

2015 Rewind-Modi Tours In 2015

12:03 PM ON 31st December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Modi Tours In 2015

అవును ... గుజరాత్ సిఎమ్ గా వుండగా ఆ రాష్ట్రానికే పరిమితమైన మోడీ తొలిసారి లోకసభలో అడుపెడుతూ ప్రధాని అయ్యారు. ఇంకేముంది. వివిధ దేశాల స్థితిగతులు అధ్యయనం చేయడానికో , సంబంధాలు నెరపడానికో, స్నేహ బంధాలు పాదుకొల్ప డానికో ఏదైనా కావచ్చు మొత్తమీద విదేశీ టూర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

పరిస్థితి ఎంతదాకా వెళ్లిదంటే  ఇండియాలో వుండేది  తక్కువ.. విదేశాల్లో గడిపేది  ఎక్కువ అంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు మోడీ. 2014లో  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస  విదేశీ పర్యటనలు చేస్తూ వస్తున్న మోడీ   2015 ఏడాదిలో పలు దేశాలు పర్యటించారు. విదేశాంగ విధానంలో మోడీ సర్కారు మహా జోరుగా సాగుతోంది. పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ కు భిన్నంగా మోడీ 12 నెలల వ్యవధిలో 37 విదేశీ పర్యటనలు జరిపారు. సరాసరిన నెలకు  మూడు దేశాలు చుట్టేశారు. .. కొన్ని దేశాల్ని అయితే.. ఏడాదిలో ఏకంగా  రెండుసార్లు పర్యటించారు.

మోడీ కవర్ చేసిన దేశాలు పరిశీలిస్తే, ... అమెరికా,  రష్యా,  ఫ్రాన్స్,  నేపాల్, సింగపూర్,  ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, చైనా, ఫీజి,  జర్మనీ, ఐర్లండ్, జపాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, మలేసియా, మారిషస్, మంగోలియా, మయన్మార్, పాకిస్తాన్, సీషెల్స్,  శ్రీలంక, దక్షిణ కొరియా, తజికిస్తాన్, టర్కీ, తుర్క్ మెనిస్తాన్, యూఏఈ, యూకే, ఉజ్జెకిస్తాన్.

ఇందులో  అమెరికా,  రష్యా,  ఫ్రాన్స్,  నేపాల్, సింగపూర్ లను రెండేసి సార్లు పర్యటించేశారు. దటీజ్ మోడీ ..

1/33 Pages

 అమెరికా

English summary

Here Are list of countries in which Indian Prime Minister Narendra Modi Visited In 2015