2015 బెస్ట్‌ CEOs

2015 Rewind- The best top CEOS

05:22 PM ON 29th December, 2015 By Mirchi Vilas

2015 Rewind- The best top CEOS

వ్యాపార రంగంలో రాణించాలంటే నాయకత్వం తప్పనిసరి. విశిష్ట నాయకత్వం కలిగిన వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచి నెంబరు వన్‌ స్థానాన్ని రీచ్‌ అయ్యేలా చేస్తుంది. అలాంటి విశిష్ట నాయకత్వం కలిగిన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నాయకత్వంతో పాటు సాంకేతిక ఆవిష్కరణలు చేపట్టి ముందుకు సాగుతూ సమాజంలో మంచి గుర్తింపు పొందిన ప్రముఖలు చాలా మంది ఉన్నారు. అందులో కొంత మంది టాప్‌ 2015 బెస్ట్‌ CEOs గా నిలిచారు. వారు ఎవరో ఇప్పుడు తెలసుకుందాం.

1/4 Pages

1. అమెజాన్‌ CEO జెఫ్‌ బెజోస్‌

అమెజాన్‌.కామ్‌ వెనుక మార్గదర్శక శక్తిగా నిలిచిన జెఫ్‌ బెజోస్‌ ఈ కంపెనీని 1994 లో స్థాపించారు. జెఫ్‌ జనవరి 12, 1964 లో న్యూమెక్సికో లో జన్మించారు. ఇతడి భార్య పేరు మకెన్జీ బెజోస్‌. వీరికి నలుగురు పిల్లలు. ఇతడు ఎంతో చాకచక్యంగా ప్రస్తుతకాలానికి అణుగుణంగా ఇ-కామర్స్‌ ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇ-కామర్స్‌ ప్రపంచంలో రాజ్యమేలతుంది. జెఫ్‌ ఎంతో తెలివైన మరియు విజ్ఞానం కలిగిన వ్యక్తి. అతడు 1982 హైస్కూల్‌ చదివే సమయంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ ప్లోరిడా లో సైన్స్‌ ట్రైనింగ్‌ పోగ్రామ్‌ లో పాల్గొని సిల్వర్‌ నైట్‌ అవార్డుని సొంతం  చేసుకున్నారు. అంతేకాకుండా ఇతడు నేషనల్‌ మెరిట్‌ స్నాలర్‌. చిన్నప్పటి నుండి ఎంతో చురుకుగా పోటీరంగాలలో పాల్గొనే తత్వం కలిగిన జెఫ్‌ ఇప్పుడు టాప్‌ వన్‌ CEO గా పేరు గడించారు.

English summary

Here you can check worlds top CEOS. It covers best and famous top CEOs of the globe. Those are Amazon CEO Jeff Bezos, Facebooks ceo Mark Zuckerberg and Netflix CEO Reed Hastings.