2015-టాప్ యాప్స్

2015 Rewind- Top Apps

05:37 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 Rewind- Top Apps

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతులోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అందులోనూ ఆండ్రాయిడ్ ఓఎస్ తో పని చేసే మొబైల్స్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మన ఫోన్ కు అవసరమైన యాప్ లను ప్లే స్టోర్ లో వెతకడం కష్టంతో కూడుకున్న పని. రోజుకో పది కొత్త యాప్ లు అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారులు ఏది మంచిదో.. ఏది చెడ్డదో తెలియక తిప్పలుపడుతున్నారు. వారి కోసం 2015లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ పై ఓ లుక్కేద్దాం.

1/11 Pages

సెవెన్ మినట్ వర్కవుట్

ఆరోగ్యం గురించి అందరికీ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. బరువు తగ్గాలని, అందంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిందే ఈ యాప్‌. కేవలం ఏడు నిమిషాల్లో మన బరువును తగ్గించుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. యూజర్ల ఎత్తు, బరువు, ఆహారపు అలవాట్లు వంటి సమాచారాన్ని తీసుకుంటుంది. అనంతరం దీంట్లో ఎప్పటి కప్పుడు బరువు వివరాలను నమోదు చేస్తే యూజర్లు తమ ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా ఇన్‌స్టాల్ చేసుకున్న అత్యుత్తమ ఫిట్‌నెస్ యాప్‌లలో ఇది ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

English summary

Here are the top apps for the year 2015. These were the most famous apps in 2015