2015 టాప్‌ 10 హిందీ బుల్లితెర భామలు

2015 Rewind- Top ten Hindi television actresses

11:12 AM ON 29th December, 2015 By Mirchi Vilas

2015 Rewind- Top ten Hindi television actresses

ఇటీవల సినిమాలకే కాదు టివి సీరియల్స్‌ కి బాగా క్రేజ్‌  పెరిగిపోయింది. అందరూ సీరియల్స్‌ ని సీరియస్‌గా రోజూ ఫాలో అయిపోతున్నారు. ఒక్క రోజు మిస్‌ అయితే చాలండీ బాబు... తెగ ఫీలయిపోతారు. అంతగా టివి సీరియల్స్‌ని అభిమానిస్తున్నారు. సినిమాలో ఎలా హీరో, హీరోయిన్లకి ప్యాన్స్‌ ఉంటారో అదే విధంగా సీరియల్స్‌కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. హిందీ  బుల్లితెర హీరోయిన్లు దాదాపు గా మన తెలుగు వారందరికి తెలుసు. ఇటీవల చాలా సీరియళ్లు హిందీ నుండి తెలుగులోకి అనువదించి తెలుగులో ప్రసారమయ్యి  ప్రేక్షకుల మదిని ఆకట్టుకుంటున్నాయి. బుల్లితెర అందాల భామలు టాప్‌ 10 జాబితాలో ఎవరు నిలిచారో చూద్దామా...

1/11 Pages

10. నియా శర్మా

నియా శర్మా సెప్టెంబర్‌ 17, 1991 లో ఢిల్లీలో జన్మించారు. ఈమె కెరీర్‌ని 2010లో ప్రారంభించారు. ఈమె అందమైన భామల టాప్‌ 10 జాబితాలో 10 వ స్థానంలో నిలిచారు. ఈమె తన అద్భుతమైన నటనతో అందరి మన్ననలు పొందారు. నియా శర్మా  మొదటి కెరీర్‌ని “  ఏక్‌ హజరోం మే మేరి బహ్న హై” సీరియల్‌ నుండి ప్రారంభించారు. ప్రస్తుతానికి “ జమై రాజా ” లో రోషిని పాత్రని పోషిస్తున్నారు. ఈ సీరియల్‌ జీ టివి లో సాయంకాలం ప్రసారమవుతుంది.

English summary