గ్రహణ వేళలో ఆలయాలను ఈ టైం కి మూసివేస్తారు

2016 Total solar eclipse

05:35 PM ON 8th March, 2016 By Mirchi Vilas

2016 Total solar eclipse

సూర్యగ్రహణం అంటే, సూర్యుడికి, భూమికి మధ్యగా చంద్రుడు ప్రవేశించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది రేపు అనగా మార్చి 9న సంపూర్ణ గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపించనుంది. నాసా పరిశోధకుల వివరణ ప్రకారం ఇండోనేషియా పపువాగినియా, బొర్నియో, పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం చూడొచ్చని వెల్లడించారు. ఈ అరుదైన గ్రహణాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. 2017 ఆగష్టు 21న మరో సంపూర్ణ గ్రహణం ఏర్పడనుందట. గ్రహణం సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం విడిచిన అనంతరం మరల తీస్తారు. ఇప్పుడు ఆలయాల మూసివేత గురించిన విషయాలను తెలుసుకుందాం.

1/6 Pages

తిరుపతి

తిరుమలలో బుధవారం  ఉదయం 6.28 నుంచి 6.48గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని, సాయంత్రం 6.30 నుంచి భక్తులకు కంపార్ట్‌మెంట్లలోకి అనుమతి నిలిపివేయనున్నట్లు టిటిడి అధికారులు  తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా రాత్రి 8.30 నుంచి శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం 9.30 గంటల తర్వాత కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతిస్తామని, ఉదయం 11.30 తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. తిరుమలలో రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం 12 వరకు అన్న ప్రసాదాలు నిలిపివేస్తారు..

English summary

The sun will disappear completely behind the shadow of the moon.The sun, the moon is between the earth by entering tomorrow Wednesday When total solar eclipse.To view the rare total solar eclipse is an increasing interest around the world.