ఆసియా మార్కెట్లకు గడ్డుకాలమేనట

2016 Would Be Challenging Year For Asia Markets

10:50 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

2016 Would Be Challenging Year For Asia Markets

వచ్చే ఆర్థిక సంవత్సరం ఆసియా మార్కెట్లకు గడ్డు పరిస్థితులు తప్పవని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్‌ తెలిపింది. చైనా ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉండటం.. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటం వంటివి అత్యధికంగా ప్రభావితం చేయనున్నాయి. ఆసియాలోని చాలా ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల రేటు తక్కువగా ఉంటాయని పేర్కొంది. దీనికి తోడు మూలధన ప్రవాహంలో ఒడిదొడుకుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థల్లో బలహీనత, నిత్యావసర వస్తువుల ధరలు పడిపోవటం, విదేశీ మారకద్రవ్య విలువలో ఒడిదొడుకులు కలసి రుణ సమస్యలను మరింత పెంచుతాయని చెప్పింది. ఈ పరిస్థితుల్లో రుణమార్కెట్లు భారీ సవాళ్లను ఎదుర్కొనున్నట్లు మూడీస్‌ నివేదికలో పేర్కొంది. చైనా పాలసీల కారణంగా మార్కెట్లో మరింత అనిశ్చితి నెలకొంటోందని మూడీస్‌ ఎండీ మైకెల్‌ టేలర్‌ తెలిపారు.

చైనా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన 6.5శాతం పైన అభివృద్ధి, సంస్కరణల అమలు, ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టడం, ఆర్థిక స్థిరత్వం అన్నీ ఒక్కసారిగా జరిగే అవకాశం లేదని టేలర్‌ తెలిపారు. 2015లో లాగానే 2016లో కార్పొరేట్‌ రుణమార్కెట్‌ గడ్డుకాలాన్ని ఎదర్కొనుంది. ప్రధానంగా రేటింగ్‌ ఒత్తిడి, రుణ ఎగవేతదారుల సంఖ్యలో పెరుగుదల ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది. ముఖ్యంగా పర్యవేక్షక విధానంలో మార్పులు, బాండ్‌ మార్కెట్‌, బ్యాంకింగ్‌లో పటిష్టమైన నిబంధనలు తదితర చర్యలతో వీటికి కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంది.

English summary

Moody's V-P and Senior Research Analyst Rahul Ghosh says that 2016 to be a challenging year for Asian corporates.