జైలు..భారీ ఫైన్ తో.. మెస్సీ కి షాక్ మీద షాక్

21 Months Jail To Football Legend Lionel Messi

11:33 AM ON 7th July, 2016 By Mirchi Vilas

21 Months Jail To Football Legend Lionel Messi

ఈ మధ్యే అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బార్సిలోనా సాకర్ స్టార్ - లియోనెల్ మెస్సీకి ఒకే రోజు షాక్ మీద షాక్ తగిలింది. బార్సిలోనా కోర్టులో పన్ను ఎగవేత కేసులో 21 నెలల జైలుశిక్ష పడింది. అతని తండ్రి జార్జ్ కు కూడా ఇవే నేరాల కింద 21 నెలల జైలు శిక్ష విధించింది. మెస్సీ మొత్తం మూడు నేరాలకు పాల్పడ్డాడని కోర్టు ప్రకటించింది. జైలుశిక్షతో పాటు మెస్సీకి 20 లక్షల యూరోలు - అతని తండ్రికి 15 లక్షల యూరోల జరిమానా కోర్టు విధించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో టాప్ టెన్ లో మెస్సీ ఉన్నారు.

కాగా ఈ తీర్పుపై స్పానిష్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని మెస్సీకి సూచించింది. అయితే స్పానిష్ చట్టాల ప్రకారం రెండేళ్లలోపు జైలుశిక్షను తిరిగి పరిశీలించే అవకాశం ఉండటంతో మెస్సీ - అతని తండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకపోవచ్చని అంటున్నారు.

కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ మధ్యే ఆ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయితే రిటైర్మెంట్ ప్రకటించడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అసలే ఫుట్ బాల్ కు దూరమై వైరాగ్యంలో ఉన్న మెస్సీ ఇప్పుడు కోర్టు తీర్పు బ్యాడ్ టైంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:చరిత్రకు సంబంధించి నడిసముద్రంలో దొరికిన అద్భుతాలు(వీడియో)

ఇవి కూడా చదవండి:అందులోకి వెళ్లొద్దన్నందుకు కన్నతల్లిని హతమార్చారు

English summary

Recently Football Legendary Player Lionel Messi said good bye to Foot Ball by announcing his retirement and shocked everyone and now he was strucked in a case and the court punished him with 21 months jail and 20 lakhs Euro fine in tax fraud case.