మధురలో చెలరేగిన హింస - ఎస్పీ సహా 21 మంది మృతి

21 people dead including SP in Mathura clashes

11:44 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

21 people dead including SP in Mathura clashes

ఉత్తరప్రదేశ్లో హింస చేలరిగింది. మధురలో ఓ పార్కు వద్ద చెలరేగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు ఎస్పీ స్థాయి అధికారి వుండగా, మరొకరు ఎస్సై. ... ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ,మధురలోని జవహర్బాగ్ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఆక్రమణదారుల వద్ద కూడా ఆయుధాలు ఉండడంతో వారు కూడా పోలీసులపై కాల్పులకు తెగబడ్డంతో, లాఠీ ఛార్జి ఆపేసి భాష్పవాయు గోళాలు ప్రయోగించామని, చివరకు కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఆక్రమణదారుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. వారిలో ఒకరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి, మరో సీనియర్ అధికారి ఉన్నారు. ఘర్షణల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడం, కాల్పుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మధురలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చూడండి:అప్పుడే పుట్టిన బిడ్డను బొమ్మలా తిప్పేశాడు

ఇది కూడా చూడండి:24 ఏళ్ళ టీచర్ ను గర్భవతి చేసిన 13 ఏళ్ళ స్టూడెంట్!

ఇది కూడా చూడండి:ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

English summary

21 people dead including SP in Mathura clashes