కృష్ణా పుష్కర సన్నాహాలు - 22 పుష్కర నగర్ లు

22 Pushkar Nagars For Krishna Pushkaralu

11:27 AM ON 12th March, 2016 By Mirchi Vilas

22 Pushkar Nagars For Krishna Pushkaralu

ఇప్పటికే కృష్ణా పుష్కరాల తేదీలను, ముహూర్తాన్ని ఖరారు చేసిన సర్కార్ ఇప్పుడు జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 12నుంచి జరబోయే కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ నగరంలో 22 పుష్కర నగర్లు ఏర్పాటు చేయాలని యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా పుష్కర నగర్ లను ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తున్నారు. డార్మిటరీ నుంచి మెడికల్‌ కిట్ల వరకు అన్నింటినీ ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన సాధ్యమవుతుందని, అందుకోసం ఇప్పటినుంచే సమన్వయంతో ముందుకు సాగాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. కమిషనర్‌ కార్యాలయంలో పలు ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అడ్మిన్ డీసీపీ జీవీజీ అశోక్‌ కుమార్‌ గత పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు, ఈ ఏడాది నిర్వహించాల్సిన ఏర్పాట్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన ఇచ్చారు.

1/4 Pages

ట్రాఫిక్‌, పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ ....

    పుష్కరాల్లో ప్రధాన సవాల్‌ ట్రాఫిక్‌, పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌ కాగలదని అందుకు సరైన ప్రణాళిక అవసరమని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు. యాత్రికులు ఒకే చోట నిలిచిపోకుండా, నిరంతరం కదులుతూ ఉండేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. బారికేడ్ల, క్యూలైనల ఏర్పాట్లు, ప్రతి ఘాట్‌కు ఇన్  అండ్‌ అవుట్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు." దాదాపు అన్ని ఘాట్లకు ఒకే రోడ్డు ఉండడం, చాలా ఘాట్లకు జాతీయ రహదారితో కనెక్టివిటీ ఉండడం ఒకరకంగా ఉపయోగకరమే అయినా.. పార్కింగ్‌, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఘాట్లకు, ఘాట్ల నుంచి బయటకు ఎన్ని దారులున్నాయో అన్నింటినీ అన్వేషించాలి. పార్కింగ్‌ ప్లేసెస్‌ను గుర్తించడం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఆర్‌ అండ్‌బీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలి. పుష్కరాల నాటికి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫ్లై ఓవర్‌ పూర్తయినా ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరి" అని ఆయన వివరించారు. 

English summary

Andhra Predesh Government was going to organise Upcoming Krishna river Pushkaralu in Vijaywada.Krishna Pushkaralu was going to be start from August 12th and for this 22 pushkar nagars have been arranged and some temporary bus stands etc.