పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు.. ఆ పై..

22 years Peddanna cheated a minor girl in Tuni

11:57 AM ON 1st September, 2016 By Mirchi Vilas

22 years Peddanna cheated a minor girl in Tuni

నేరాలు రోజురోజుకీ పెరిగిపోవడమే కాదు.. ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఘటనలు సాగిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను శారీరకంగా లోబరుకున్నాడు. అవసరం తీరాక నీకు దిక్కున్నచోట చెప్పుకో అన్నాడు. మరోమారు పెళ్లి కోసం ఒత్తిడి తెస్తే... నగ్నంగా తీసిన వీడియోలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. దీంతో గత్యంతరం లేక బాధితురాలు తల్లితో కలిసి గాజువాక పోలీసులను ఆశ్రయించింది. నింధితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు పంపారు. విస్మయానికి గురిచేసే ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. యాతపాలేనికి చెందిన వరలక్ష్మి టీ కొట్టు నిర్వహిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తోంది.

తుని సమీపంలోని మల్లివరానికి చెందిన చుక్కా పెద్దన్న(22) పెదగంట్యాడ సత్యనారాయణపురంలో గది అద్దెకు తీసుకుని నివాసం వుండేవాడు. స్థానిక ట్రాన్స్పోర్టు సంస్థలో క్లీనర్ గా పని చేస్తున్నాడు. తరచూ వరలక్ష్మి టీ కొట్టుకు వస్తూ ఆమె కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ప్రేమ.. పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి బాలికకు చేరువయ్యాడు. ఆరు నెలల పరిచయంలో ఇంట్లో తల్లి లేని సమయంలో కాబోయే భర్తనే కదా.. అంటూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. అలా ఇంట్లో ఇద్దరిని పట్టుకున్న స్థానికులు, పెద్దన్న తల్లిదండ్రులను, గ్రామపెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టారు.

ప్రస్తుతానికి బాలిక మైనర్ కనుక మేజర్ కాగానే వివాహం చేసుకుంటాడని వారు హామీ ఇచ్చారు. కానీ లిఖిత పూర్వకంగా పత్రాలు రాసుకోలేదు. అప్పటి నుంచి బాలిక ఇంటికి రాకపోకలు సాగిస్తున్న పెద్దన్న కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: ఫ్రెండ్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న అమల

ఇది కూడా చదవండి: మందు తాగి షూటింగ్ కి వచ్చిన బిచ్చగాడు హీరో

English summary

22 years Peddanna cheated a minor girl in Tuni. A 22 years boy(Peddanna) cheated a girl in Tuni and escaped from the town.