22ఏళ్ళ క్రితం ఈ నలుగురు ఇలా ...

22 Years Rare Old Pic Of Tollywood Heroes Heroines

10:45 AM ON 29th July, 2016 By Mirchi Vilas

22 Years Rare Old Pic Of Tollywood Heroes Heroines

గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరైతే మీరు ఎందుకని అనుకోవచ్చు. కానీ ఒక హీరో సినిమాకి మరో హీరో అతిధిగా రావడం ఎప్పుడూ వుంది. అందుకు 22 ఏళ్ళ క్రితం ఈ నలుగురు అగ్రహీరోలు (అప్పట్లో మాంచి ఫార్మ్ లోకి వస్తున్నవాళ్ళే) ఒకేచోటా చేరారు. అరుదైన ఈ చిత్రం ఇది. అప్పట్లోనే నలుగురు అగ్రహీరోలను ఒకే చోట చూసి ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పరవశులయ్యారు. ఇక ఇప్పుడు కూడా అలరిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం ప్రారంభోత్సవంలో తీసిన ఫొటో ఇది. అంజనా ప్రొడక్షన్స్ బేనరుపై నాగేంద్రబాబు, పవనకల్యాణ్ నిర్మించిన ఈ మూవీకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇక రమ్మకృష్ణ, రోజా, నగ్మా హీరోయిన్లుగా నటించారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఉన్న దేవాలయంలో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్, మీనా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అప్పుడు క్లిక్ మన్న ఫోటో ఇది. అన్నట్టు 1994 జనవరి 7న ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం విడుదలై అభిమానులను అలరించింది. అంతేకాదు ‘అలెక్స్ పాండ్యన్’ పేరుతో తమిళంలోకి ఈ మూవీని డబ్ చేశారు. అదండీ సంగతి.

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: మిమ్మల్ని పోలిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

English summary

22 Years Rare Old Pic Of Tollywood Heroes Heroines.