ఆ ఊళ్ళో 11 ఏళ్లనాటి సమస్య ఆ అమ్మాయి ఇలా తీర్చేసింది

23 Year Old Woman Brings Electricity To Her Village

10:48 AM ON 15th September, 2016 By Mirchi Vilas

23 Year Old Woman Brings Electricity To Her Village

కొన్ని సమస్యలు త్వరగా తీరతాయి. కొన్ని దీర్ఘకాలం ఉంటాయి. కొన్ని సమస్యలు ఎంత జఠిలంగా వున్నా క్షణాల్లో పరిష్కారం అవుతాయి. సరిగ్గా ఓ ఊళ్ళో అదే జరిగింది. తామంతా పదకొండేళ్లుగా చేయలేని పని ఆ అమ్మాయి ఒక్క రోజులో చేసిందని అంటున్నారు ఉత్తర ప్రదేశ్ లోని బదియా గ్రామస్థులు. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది? వాళ్లెందుకు పొగుడుతోన్నారు? అసలు ఆ అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఉత్తర ప్రదేశ్ జిల్లాలోని ఇటా జిల్లాకు చెందిన బదియా గ్రామానికి కరెంటు సదుపాయం లేదు. 2005 జనవరిలో విద్యుత్ సదుపాయం కల్పించినప్పటికీ భారీ తుఫాను కారణంగా అది కూడా పోయింది. దీంతో 11 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు గ్రామస్థులు. అయినా ఇప్పటికీ ఎవరూ స్పందించలేదు. అదే గ్రామానికి చెందిన దీప్తిమిశ్రా(23) ప్రధానమంత్రి కార్యాలయానికి ఆన్ లైన్ ద్వారా సందేశాన్ని పంపింది. దీంతో స్పందించిన పీఎం కార్యాలయం ఆ గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించింది.

దీంతో గ్రామస్థులు దీప్తిని తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ, దీప్తి చిన్నప్పటి నుంచి చాలా తెలివైందని, ఏ పనైనా తెలివిగా, చురుకుగా చేసేదని ఆ గ్రామపెద్ద రణ్ వీర్ సింగ్ చౌదరి చెప్పారు. 12వ తరగతి వరకు సొంత గ్రామంలోనే చదువుకున్న దీప్తి, ఆపై చదువులను నోయిడాలో పూర్తి చేసింది. మాస్ కమ్యునికేషన్ కోర్స్ కూడా పూర్తి చేసింది. మొత్తానికి హాట్ టాపిక్ అయింది ఈ అమ్మాయి .

ఇవి కూడా చదవండి:డబ్బులు గుంచిన టిటిఈ పై ట్వీట్ -- రైలు దెగేసరికి సస్పెండ్

ఇవి కూడా చదవండి:అందాలు ఒలకబొయ్యడంలో రష్మీని మించిపోయిన శ్రీముఖి(ఫోటోలు)

English summary

A 23 year old woman named Deepthi Mishra was written an online letter to Prime Minister Office and she was succeed to bring electricity to her village after 11 long years. Now she became popular in that village and so many people were praising her for her help to to that village.