అమెరికాలో సూర్య 24 భారీ వసూళ్లు

24 movie US box office collection

10:57 AM ON 11th May, 2016 By Mirchi Vilas

24 movie US box office collection

సూర్య హీరోగా నటించిన ‘24’ చిత్రం బానే ఉందనే టాక్ ఇటు ప్రేక్షకుల నుంచి అటు విమర్శకుల నుంచి తెచ్చుకుంది. అంతేకాదు ఈ చిత్రం విశేషంగా వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో అయితే వసూళ్ళ పంట పందిస్తోందని ఆనందం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రంలో సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించారు. విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య నిర్మించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ఒక సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌. ఏప్రిల్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతంగా కలెక్షన్స్‌ని రాబడుతోందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. తొలి వారంలోనే 1.1 మిలియన్‌ డాలర్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. యూఎస్‌ఏ, కెనడాలో మొత్తం రూ. 7.62 కోట్లు వసూలు చేసినట్లు తరణ్‌ ట్వీట్‌ చేశారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:ఏ దానం చేస్తే ఏమొస్తుంది.. దాని వల్ల కలిగే లాభాలు

English summary

Tamil Hero Suriya's 24 movie hits at US Box Office Collections. Its Collects 1.1 Million Dollars in US in the first week and it collected 7.62 crores in Canada. This movie was directed by Vikram K Kumar and Samantha,Nitya Menon acted as heroines in the movie. Suriya acted in three different in the movie.