ఐటీలో 2.5లక్షల ఉద్యోగాలు: టీమ్‌లీజ్‌

2.5 Lakh New Jobs in IT Sector

10:23 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

2.5 Lakh New Jobs in IT Sector

ఐటీ రంగం మరోసారి జోష్ చూపిస్తుందట. ఈ ఏడాది ఎక్కువ సంస్థలు డిజిటలీకరణపై దృష్టి పెట్టడంతో ఈ రంగంలో కొత్తగా రెండున్నర లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. ప్రముఖ ఉద్యోగ నియామక సంస్థ టీమ్‌లీజ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యాపార సంస్థలు సేవల నుంచి పరిష్కార ప్రక్రియ వైపు దృష్టి సారించడంతో ఐటీ రంగంలో భారీ నియామకాలకు అవకాశం ఉంది. గత ఏడాది ఈ రంగంలో 12 శాతం ఉద్యోగ అవకాశాలు లభించగా ఈ సారి 14-16 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. డిజిటైజేషన్‌ వల్ల సంస్థలు ప్రత్యేక నైపుణ్యాలు గలవారిని ఎంపిక చేసుకోనున్నాయి. 70,000 డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగాల సృష్టి జరగనుంది. యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైనర్లు, వెబ్‌ డెవలపర్లు, ప్రొడక్ట్‌ డెవలపర్లు, మొబైల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్లు, వ్యాపార విశ్లేషకులు, సమాచార భద్రత విశ్లేషకులు, క్లౌడ్‌ ఆర్కిటెక్టులు, డాటా సైంటిస్టులు, కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ ఉంటుందని టీమ్‌లీజ్‌ సేవల సహాయ జనరల్‌ మేనేజర్‌ అల్కా దింగ్రా తెలిపారు.

English summary

Accordibng to a Report IT sector hiring is expected to see a significant uptrend this year as more and more companies focus on digitisation and the sector is likely to create 2.5 lakh new job openings this 2016