నీటి యుద్ధం ఖరీదు రూ.25వేల కోట్లు

25 thousand crores shut for water war

06:18 PM ON 15th September, 2016 By Mirchi Vilas

25 thousand crores shut for water war

అన్ని వివాదాల్లోకి నీటి వివాదం చాలా ప్రమాదం. కుళాయి పంపుల దగ్గరే నీళ్లు పట్టుకునే విషయంలో ముందూ వెనుక గురించి పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అలాంటిది రెండు రాష్ట్రాల మధ్య నీటికోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో, కావేరీ జలాల పంపిణీ సమస్య చెప్పకనే చెబుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళల్లో నిప్పులు పుట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడుల మధ్య చెలరేగిన జలవివాదంతో వ్యాపార సంస్థలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికారణంగా హింస చెలరేగడంతో పేరెన్నికగన్న పెద్ద సంస్థలన్నీ మూతబడ్డాయి. ఇన్ఫోటెక్, టిసియస్, ఇన్ఫోసిస్, విప్రో, లాంటి హేమాహేమీ సంస్థల్లో పని చేస్తున్న సుమారు డెభ్బయివేల మంది ఉద్యోగులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

వీటికి తోడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థల గూడ్స్ డెలివరీ మీద తీవ్ర ప్రభావం చూపించింది. నీటి యుద్ధం కారణంగా అసోచెమ్ అంచానా ప్రకారం ఇప్పటి దాకా సుమారు ఇరవైఅయిదు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే, సమస్య పరిష్కారం కోసం పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

ఇది కూడా చదవండి: చనిపోకముందు హీరోయిన్ సౌందర్య చెప్పిన కొన్ని షాకింగ్ నిజాలు(వీడియో)

ఇది కూడా చదవండి: జలకాలాటల పాటలో ఏం చేశారో తెలుసా ?

ఇది కూడా చదవండి: ఆ ఊళ్ళో 11 ఏళ్లనాటి సమస్య ఆ అమ్మాయి ఇలా తీర్చేసింది

English summary

25 thousand crores shut for water war. Tamil Nadu and Karnataka states are fighting for Kaveri Lake.