ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఉంటేనే టికెట్ అట

25 Thousand Followers On Facebook Gets Ticket

05:35 PM ON 18th March, 2016 By Mirchi Vilas

25 Thousand Followers On Facebook Gets Ticket

ఎన్నికల్లో సాధారణంగా పార్టీ టికెట్స్ ఇచ్చేటప్పుడు గతంలో అయితే అభ్యర్ధుల గుణగణాలు విచారించేవారు. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. కులం , ప్రాంతం , అన్నింటికీ మించి ఫుల్ గా పైసలుండాలి, డబ్బూ దస్కం లేకుంటే, టికెట్ హుళ్ళక్కే. కానీ ఈవన్నీ తర్వాత ముందు వుండాల్సింది వేరే అంటున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు... ఇంతకీ అదేమంటే, 'ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఉందా.. వుంటే సరిపోదు... అందులో 25 వేల మంది అభిమానులున్నారా.. అలాగైతేనే మీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తాం" అంటూ ఆయన తేల్చి చెప్పేసారు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు వచ్చేఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్న అభ్యర్థులకు అమిత్ షా ఈ విధంగా గట్టి షాకిచ్చారు. సోషల్‌ మీడియాలో పేరున్న నేతలకే టికెట్‌ ఇస్తామని స్పష్టం చేయడం వెనుక పెద్ద వ్యూహమే వుంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నేతలెవరూ సోషల్‌ మీడియాలో పెద్దగా క్రియాశీలంగా లేకపోవడమే ఇక దీంతో పోటీకి ఉబలాటపడుతున్న ఎంపీల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. వారెవ్వా వాటే ఐడియా...

హృతిక్ ను జైలు పాలు చెయ్యనున్న కంగనా

ఇలియానా మరీ ఇంత చీపా

రోజా వ్యవహారంపై అప్పీలు - సోమవారం విచారణ

రూ.10 కోట్లు డిమాండ్ - అంతలోనే హతమార్చారు

English summary

BJP National President Amit SHah Says that the Candidates who will have 25 thousand Followers in Facebook will get the BJP party ticket in Upcoming Uttar Pradesh Elections.