చిరంజీవికి నచ్చని ‘గ్యాంగ్‌లీడర్‌’- వాస్తవాలు ఇవిగో

25 Years For Chiranjeevi Gang Leader Movie

03:38 PM ON 9th May, 2016 By Mirchi Vilas

25 Years For Chiranjeevi Gang Leader Movie

ఆ రోజుల్లో మెగాస్టార్ అంటే అదో ఊపు...సినిమా వస్తే అభిమానులకు పూనకమే...ఇక చిరుతో విజయశాంతి జోడీ కడితే, అది బ్లాక్ బస్టర్... ఆ కోవలో వచ్చేందే 'గ్యాంగ్ లీడర్'. నటనపరంగానే కాకుండా కాస్ట్యూమ్స్‌, గెటప్‌ పరంగా మెగాస్టార్‌ చిరంజీవిని సరికొత్తగా కోణంలో ఆవిష్కరించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’ నిజంగానే కొత్త రికార్డులు నెలకొల్పింది. మధ్య తరగతి నిరుద్యోగ యువకునిగా చిరు గడ్డంతో, రంగురంగుల కాటన్‌షర్ట్స్‌, ఫేడెడ్‌ జీన్స్‌తో కనిపించి మెగాస్టార్  ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు. ఇక  ఈ సినిమా విడుదలయ్యాక ‘గ్యాంగ్‌లీడర్‌ షర్ట్స్‌’ పేరుతో మార్కెట్‌లోకి అనేక మోడల్స్‌ విడుదలయ్యాయంటేనే చిరంజీవి కాస్ట్యూమ్స్‌కి ఎంత క్రేజ్‌ ఏర్పడిందో వేరే చెప్పనవసరం లేదు. అప్పటికే ఉన్నత శిఖరానికి చేరిన మెగాస్టార్‌ ఇమేజ్‌ని శిఖరాగ్రానికి చేర్చిన ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీనే. అలాగే బాక్సాఫీస్‌ని రఫ్‌ ఆడించి, వసూళ్లపరంగా కూడా సరికొత్త రికార్డులకు వేదిక అయ్యింది. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. ‘గ్యాంగ్‌లీడర్‌’ విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్ళు అయిన సందర్భంగా ఓసారి గతంలోకి వెళ్దాం.

ఇవి కూడా చదవండి:చిరంజీవి అందులో బెస్ట్ ... పైగా మంచోడు

1/10 Pages

నాగబాబు హీరోగా

1991 మే 9న ‘గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం విడుదలైంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించి, ఘనవిజయం సాధించింది. వాస్తవానికి ‘అరె ఓ సాంబా’ టైటిల్ అనుకున్నారు. ఇక నాగబాబుని హీరో అనుకున్నారు. ఎందుకంటే, ‘ఖైదీ నంబర్‌ 786’ చిత్రం విడుదయ్యాక నాగబాబు హీరోగా ఓ  సినిమా విజయ బాపినీడు ప్లాన్ చేశారట. రాజాచంద్ర దర్శకత్వంలో అన్నదమ్ముల కథతో తను నిర్మించిన ‘బొమ్మరిల్లు’ కథనే కొంచెం మార్చి, హీరోయిజం పాళ్లు పెంచి, విజయబాపినీడు ఈ కథ తయారు చేశారు.

English summary

Mega Star Chirenjeevi's Gang Leader movie Completes 25 years today. This movie was first planned with Nagendra Babu but later taken with Chiranjeevi. This movie was dubbed into Tamil and Hindi and there also this movie was Super Hit at the Box Office.