శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

2500 Crore Worth Lord Krishna Idol in Baba Bansidhar Temple

11:02 AM ON 31st August, 2016 By Mirchi Vilas

2500 Crore Worth Lord Krishna Idol in Baba Bansidhar Temple

నిజంగా ఇక్కడున్న శ్రీకృష్ణడు విగ్రహం ఖరీదు చూస్తే గుండె గుభేల్ మంటుంది. అంత విలువైనదా అనవచ్చు. అయితే నిజంగా విలువైనదే. ఇంకా చెప్పాలంటే, శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడని అంటుంటారు కదా. అందుకే నల్లనయ్యా అని సంభోదిస్తారు. కానీ జార్ఖండ్ లోని ఈ ప్రతిమను చూస్తే తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. ఇక నుంచి బంగారయ్యా అని పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందూ దేవుళ్లలో అత్యంత ఖరీదైన, అరుదైన విగ్రహం జార్ఖండ్ లోని బాబా బస్నిదార్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఉంది. శివపహారి సమీపంలోని కన్హర్ నదీతీరంలో బయల్పడ పురాతన శ్రీకృష్ణుడి విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. 1280 కిలోల బంగారంతో తయారుచేసిన విగ్రహం ఇది. ఆ విగ్రహ తయారికి అయిన ఖర్చెంతో తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు.

దాదాపు 2,500 కోట్లు వెచ్చించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. 131 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్తరప్రదేశ్ లో లభ్యమైన ఈ విగ్రహం ప్రస్తుతం జార్ఖండ్ లో పూజలందుకుంటోంది. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా ఈ శ్రీకృష్ణ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడీ ఆలయానికి దొంగల బెడద పట్టుకుంది. ఇంత విలువైన ఈ విగ్రహాన్ని కాజేయాలని దొంగలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు.

ఇవి కూడా చదవండి:వినాయక చవితి ఉత్సవాల్లో మీరు చేస్తున్న క్షమించరాని తప్పులు

ఇవి కూడా చదవండి:ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

English summary

Lord Krishna was the God of Hindus and people worship Lord Krishna in many Avtars. Recently an idol of LOrd Krishna came into news because that Lord Krishna Idol was made of Pure Gold and the estimated cost of that idol is 2500 crores. At Present that expensive Lord Krishna idol was in Baba Bansidhar Temple in Jharkhand. Jharkhand Government was protecting this idol with full security because of thieves threat.