ఈ-కామర్స్ అదే జోష్..!

25,0000 New E-commerce Jobs In 2016

09:37 AM ON 6th February, 2016 By Mirchi Vilas

25,0000 New E-commerce Jobs In 2016

ఈ-కామర్స్‌ రంగం జోరు కొనసాగుతోంది. రోజురోజుకూ ఈ రంగం పరిధి పెరుగుతోంది. 2016లో ఆన్‌లైన్‌ రీటైల్‌ విభాగంలో 60-65 వృద్ధిరేటు సాధించనుందట. అంతే కాదు సుమారు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలని సృష్టిస్తుందని అసోచామ్‌ నివేదిక పేర్కొంది. గత ఏడాది ఈ-కామర్స్‌ సంస్థలు గరిష్ఠంగా అమ్మకాలు జరిపాయని, ఈ సంస్థలు గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశమని తెలిపింది. 2009లో భారత ఈ-కామర్స్‌ రంగం విలువ 3.8 బిలియన్‌ డాలర్లు ఉండగా 2014లో అది 17 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత ఏడాది 23 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా ఈ సంవత్సరం 38 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అసోచామ్‌ అంచనా వేసింది. ఈ-కామర్స్‌ రంగం 2016లో 2.5 లక్షల ఉద్యోగాలు సృష్టించనుంది. ఆన్‌లైన్‌ రిటైల్‌ విభాగంతో పాటు తాత్కాలిక ఉద్యోగాలు, సప్లైచైన్‌, లాజిస్టిక్స్‌, సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది ఆసోచామ్ తెలిపింది. ఈ-కామర్స్‌ మార్కెట్‌లో 20-25 శాతం మొబైల్‌ కామర్స్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ-కామర్స్‌ సంస్థల్లో నియామకాల వృద్ధి 60-65 శాతం వేగంగా ఉంటుందని వచ్చే మూడు, నాలుగేళ్లలో 5-8 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పింది. ఐఐఎం లాంటి అత్యున్నత విద్యా సంస్థల్లో ఎంబీఏలు చేసినవారు సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా ఈ-కామర్స్‌ రంగంలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించింది.

English summary

E-commerce is likely to generate during 2016 nearly 2.5 lakh jobs in India's online retail, including temporary employees, supply chain, logistics and ancillary units