ఇతడు 256ఏళ్ళు ఎలా బతికాడు ?

256 Year Old Chinese Li ching-yuen life history

03:00 PM ON 30th May, 2016 By Mirchi Vilas

256 Year Old Chinese Li ching-yuen life history

వింతలూ విడ్డూరాలు లేకపోతే కిక్కు వుండదు. అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం వారణాసిలో మహష్టి మురాసి అనే వ్యక్తి (179 ఏళ్లు) బ్రతికాడని చెప్పుకున్నారు. నేషనల్ మీడియా సైతం ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. అతనే ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అని గిన్నిస్ బుక్ లో రికార్డు చేశారు. ఇంతకంటే.. ఎక్కువ సంవత్సరాలు బ్రతక కలిగిన వ్యక్తులు ఇంకా జీవించి ఉన్నారా? అంటే అనుమానం వ్యక్తం చేస్తాం. కానీ 256 సంవత్సారాలు బ్రతికిన వారు ఉన్నారు? అవునా, అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా?

లీచింగ్ యుయెన్ అనే వ్యక్తి వయస్సు (256) సంవత్సరాలు. ఈరోజుల్లో 70 సంవత్సారాలు బ్రతుకుతాం. మహా అయితే 100ఏళ్లు బ్రతుకుతాం. అంతకంటే మరో పదేళ్ళు ఎక్కువగా జీవించి ఉన్నారా అంటే ఆ సంగతి మనకు తెలియదు. కానీ లీచింగ్ యుయెన్ 256సంవ్సరాలు బ్రతికాడు. నమ్మినా..నమ్మకున్నా ఇది అక్షరాల సత్యం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఇంకొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం అట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అంశం చక్కర్లు కొడుతోంది.

చెంగ్డూ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న వు చుంగ్ చై న్యూయార్క్ టైమ్స్ తో తెలిపిన కథనం ప్రకారం. చైనాలో జన్మించిన లి చింగ్ యుయెన్ అనే వ్యక్తి 256 సంవత్సరాలు బ్రతికినట్లు 1827సం.లో 150 పుట్టినరోజు , 1877 సం.లో 200 పుట్టిన రోజు జరుపుకున్నట్లు చైనీస్ గవర్నమెంట్ రికార్డులో నమోదైనట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ 1928 ఆదారాలతో సహా వెలుగులో తెచ్చింది. ఈ కథనాన్ని 1930 లో ప్రచురించింది.

లీ చింగ్ జీవన విధానం ఆహారపు అలవాట్లు

లీ చింగ్ యుయెన్ 10 సంవత్సరాల వయస్సు నుంచి ఎక్కువ కాలం జీవించే గుణాలు కలిగిన లింజై, గోజీ బెర్రీ, జిన్సెంగ్, గోటుకోలా వంటి ఔషదాలను 40సంవత్సరాల దాకా ఆహారంగా తీసుకున్నాడు. అయితే యుద్ద విన్యాసాల్లో ఆరితేరిన లీను 1749 సం.లో అంటే 71 సంవత్సారల వయస్సులో చైనా సైన్యానికి యుద్ధ విన్యాసాలను నేర్పే గురువుగా తీసుకున్నారు. అయితే వాళ్లలో తన ను ఇష్టపడే వ్యక్తిని 23 సార్లు వివాహం చేసుకొని దాదాపూ 200 పిల్లలకు జన్మనిచ్చాడు. ఇంత మంది పిల్లలు ఎవరా అని ఫ్రొఫెసర్ విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆయన జీవిత రహస్యంపై అనుమానం వచ్చిన వాళ్లు ఇన్ని సంవత్సరాలుగా ఎలా బ్రతుకుతున్నారని ప్రశ్నిస్తే. ఒకటే సమాధానం. ఎప్పుడూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. వ్యాయామంతో శ్వాసకు సంబంధించిన పద్దతులు అవలంభించడం, తనకిష్టమైన తాబేలు పిల్లలా పరుగులు తీయడం..పక్షుల్లాగా నిద్రపోవడం, ఇలా తను పాటించిన ఆహారపు అలవాట్ల వల్లే ఇన్ని సంవత్సరాలు బ్రతికానని సగర్వంగా చెప్పుకుంటాడు. అంతే కాదండో తన రాష్ట్రంలో వృద్దాప్యంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా రికార్డు లీ రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.చనిపోయిన లీ గా250 సంవత్సారాలు బ్రతకాలంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు.

English summary

Whereas Li Ching-Yuen himself claimed to have been born in 1736