స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

26 years teacher ran away with 15 years student

10:39 AM ON 14th March, 2016 By Mirchi Vilas

26 years teacher ran away with 15 years student

ఒకప్పుడు గురువు అంటే విద్య నేర్పేవాడని, తల్లిదండ్రులు తరువాత గురువే ప్రత్యక్ష ధైవం అని చెప్పేవారు. కానీ కాలం మారే కొద్దీ మనుషులు కూడా మారుతున్నారు. విధ్యార్ధులకు మంచి బుద్ధి నేర్పించాల్సిన గురువులే తప్పులు చేస్తున్నారు. తరచూ ఏదో ఒక సంద‌ర్భంలో టీచర్-విద్యార్థికి మ‌ధ్య సంబంధాల పై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి విషయమే ఒకటి బయటకి వచ్చింది. 26 సంవత్సరాల వయసున్న ఒక టీచర్ తన 15 సంవత్సరాల స్టూడెంట్ తో లేచిపోయింది. లేచిపోయిన ఆ టీచర్ 11 నెలల తర్వాత పోలీసులకు పట్టుబడింది. అసలు విషయంలోకి వస్తే త‌మిళ‌నాడులోని తిరునెల్వేలి జిల్లా, సెంగోట్టై కాలాంగరైకు చెందిన గోదైలక్ష్మి(26). ఒక ప్రైవేటు మెట్రిక్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది.

ఇదే పాఠశాలలో శివసుబ్రమణియన్(15) టెన్త్ క్లాస్ చదివేవాడు. ఈ క్రమంలో గోదైలక్ష్మి-శివసుబ్రమణియన్ మధ్య ప్రేమ ఏర్పడడంతో ఆ ప్రేమ లేచిపోయే వరకు దారి తీసింది. గత సంవత్సరం వీరిద్దరూ పుదుచ్చేరికి వెళ్ళిపోయి అక్కడ గోదైలక్ష్మి ఒక పాఠశాలలో టీచర్ గానూ, శివసుబ్రమణియన్ ఒక పెట్రోలు బంకులో పనిలోకి చేరారు. లేచిపోయాక శివసుబ్రమణియన్ త‌న స్నేహితులతో తరచూ ఫోన్ లో మాట్లాడేవాడు. ఈ విషయం పై నిఘా వేసిన పోలీసులు ఆ ప్రేమ జంట కోసం పుదుచ్చేరికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రేమజంట అక్కడి నుంచి ఉడాయించారు.

ఇంక చేసేది లేక శివసుబ్రమణియన్‌ తల్లి మారియమ్మాళ్ జూన్‌లో మదురై హైకోర్టు లో ఒక హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీని పై విచారణ జరిపిన మధురై హైకోర్టు మూడు నెలల్లోగా శివసుబ్రమణియన్-గోదైలక్ష్మిలను కోర్టులో హాజరు పరచాలంటూ పోలీసులకు ఆర్డర్ వేసింది. అయినా సరే పోలీసులు ఆ ప్రేమజంట గుట్టు తెలుసుకోలేకపోయారు. ఇంక చేసేది లేక పోలీసులు గోదైలక్ష్మి సెల్‌ఫోన్ నంబర్ ల పై మాటు వేశారు. అయినా ఏ మాత్రం లాభం లేకపోయింది. అయితే గత వారం రూపాయి కాయిన్ బాక్స్ ఫోన్ నుండి శివసుబ్రమణియన్ తన స్నేహితునికి కాల్ చేశాడు.

ఈ ఫోన్ నంబర్ పై పోలీసులు ఆరా తీయగా అది తిరుపూర్ నుంచి వచ్చినట్లు తెలిసింది. వెంటనే పోలీసు బృందం తిరుపూరుకు బయలుదేరింది. తిరుపూరు సమీపంలోగల కులవన్‌పట్టి నుంచి ఫోన్ వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని గాలించారు. అక్కడ ఓ ఇంట్లో ఆ ప్రేమజంట నివాసముంటున్నట్లు కనుగొన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇరువురిని మధురై కోర్టులో హాజరు పరిచారు.

English summary

26 years teacher ran away with 15 years student. Godailakshmi(26) years teacher ran with SivaSubramanyan(15) 10th class student in Tamilnadu.