'తలనీలాలతో' 26.11 కోట్లు ఆదాయం!

26.11 crores income for TTD

03:15 PM ON 12th December, 2015 By Mirchi Vilas

26.11 crores income for TTD

దేవాలయాలకి వచ్చే సంపదలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ రెండో స్ధానంలో నిలుస్తాడు. తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామికి నవంబర్‌ నెలలో వేలాది మంది భక్తులు సమర్పించిన తలనీలాలకి వచ్చిన ఆదాయం అక్షరాలా 26.11 కోట్లు రూపాయలు. ప్రతీ నెల మొదటి గురువారం నాడు టీటీడి అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా తలనీలాలకు వేలం నిర్వహిస్తారు. అయితే ఇటీవల చెన్నై లో సంభవించిన వరదలు వల్ల ఈ వేలాన్ని వాయిదా వేశారు. ప్రసుత్తం చెన్నై కోలుకోవడంతో ఈ గురువారం వేలం నిర్వహించారు.

అన్ని రకాల తలనీలాలు కలిపి 30,800 కిలోల వచ్చింది. ఈ తలనీలాలు అమ్మకం జరగగా టిటిడి కి 26.11 కోట్లు రూపాయల ఆదాయం వచ్చిందని టిటిడి జీఈవో శ్రీనివాసరావు.

English summary

26.11 crores income for TTD(Tirumala Tirupati Devasthanams)