షాకింగ్: 2025కల్లా 26.8 కోట్ల మంది ఊబకాయులవుతారట...

26.8 crores will turned as a fat in 2025

11:43 AM ON 12th October, 2016 By Mirchi Vilas

26.8 crores will turned as a fat in 2025

ఊబకాయం తలచుకుంటేనే కొందరికి భయం. ఎలా తగ్గించుకోవాలా అని రకరకాల ప్రయత్నాలు చేయడం కూడా చూస్తూనే ఉంటాం. అయినా ప్రపంచ బాలల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలో 2025వ సంవత్సరం నాటికి 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల్లో 26.8 కోట్ల మంది అధికబరువు సమస్యతో సతమతమయ్యే అవకాశం ఉందని తాజాగా వాషింగ్ టన్ పరిశోధకులు అంచనా వేశారు. పిల్లల జీవనశైలిలో మార్పులు చేసుకోకుంటే ఊబకాయుల సంఖ్య పెరిగే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరించారు. అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో పెరుగుతున్న అధిక బరువు సమస్యపై అంచనాలను విడుదల చేశారు.

2025 వ సంవత్సరం నాటికి 4 మిలియన్ల మంది పిల్లలు టైప్ 2 మధుమేహవ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. మరో 27 మిలియన్ల మంది రక్తపోటుతో, 38 మిలియన్ల మంది కాలేయంలో కొవ్వు సమస్యతో బాధపడతారని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు. పిల్లల్లో ఊబకాయం సమస్య అంటువ్యాధిలాగా మారి పలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని టిమ్ లోబస్టెయిన్ చెప్పారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పిల్లల్లో ఊబకాయం పెరగకుండా తగిన చర్యలు చేపట్టాలని పరిశోధకులు హెచ్చరించారు.

English summary

26.8 crores will turned as a fat in 2025