29 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక

29 Tamil Nadu Fishermen Arrested By Srilanka

12:22 PM ON 1st January, 2016 By Mirchi Vilas

29 Tamil Nadu Fishermen Arrested By Srilanka

తమిళనాడుకు చెందిన 29 మంది జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. శ్రీలంకలోని ట్రింకోమలీ తీరంలో చేపలు పట్టడానికి వారు వెళ్లినప్పుడు శ్రీలంక నావికాదళం వారిని అదుపులోకి తీసుకుంది. మూడు పడవల సహా జాలర్లనందరినీ శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు సుబ్బురాజ్‌ తెలిపారు. జాలర్లంతా నాగపట్టణం జిల్లాలోని అక్కరాయ్‌పెట్టాయ్‌కు చెందిన వారని ఆయన చెప్పారు. కాగా, ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. పదేపదే ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

English summary

29 Tamil Nadu Fishermen Arrested By Srilanka