గనిలో 120 గంటలు నరకం..!

29 Workers Survived After 120 Hours

06:27 PM ON 30th December, 2015 By Mirchi Vilas

29 Workers Survived After 120 Hours

మనిషికి అత్యవసరం గాలి.. నీరు.. ఇవి లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేం.. అలాంటిది ఒకటీ.. రెండు కాదు ఏకంగా 120 గంటలు గాలి.. నీరు లేకుండా బతకడం అంటే నరకం చూడటమే. ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకున్నారు ఆ కూలీలు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని క్షణమొక యుగంగా గడిపారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో చివరకు అదృష్టవశాత్తూ సజీవంగా బయటపడ్డారు. చైనాలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జిప్సమ్‌ గనిలో ఒక్కసారిగా గని పైకప్పు కూలింది. ప్రమాద సమయంలో 29 మంది కార్మికులు గనిలో పని చేస్తున్నారు. దీంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 20 మందిని రక్షించగలిగారు. మిగిలిన 9 మంది గల్లంతయ్యారు. ఐదు రోజులుగా ఆ ప్రాంతంలో సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 120 గంటల తర్వాత సహాయక సిబ్బంది గల్లంతైన వారిని గుర్తించారు. ఇందులో ఒక వ్యక్తి మృతి చెందగా.. ఎనిమిది మందిని సిబ్బందిని బయటకు తీసి వారిని ఆసుపత్రికి తరలించారు.

English summary

29 workers have been rescued from Shandong gypsum mine after 120 hours. On 25th of this month Shandong gypsum mines collapsed in China