మెగా ఫంక్షన్ లో 'అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'

3 amazing wives gave pose for photo

06:24 PM ON 25th August, 2016 By Mirchi Vilas

3 amazing wives gave pose for photo

మెగాస్టార్ కుటుంబంలో ఎదో వేడుక జరుగుతూనే వుంది. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోడలు.. ఉపాసన.. అలాగే అల్లు అరవింద్ కోడలు స్నేహ రెడ్డి.. ఇలా అందరూ కలసి ఫోటోలు అవీ దిగుతూనే కనిపిస్తున్నారు. అంతేకాదు, చాలా అకేషన్లలో వీరు కలసి ఫోటోలకు ఎన్నో ఫోజులిచ్చారు. అయితే ఇప్పుడు వీరితో సూపర్ స్టార్ మహేష్ భార్య అయిన మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ జాయిన్ అవ్వడమే అసలైన కిక్ ఇచ్చిందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే, మొన్న హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో మెగాస్టార్ చిరంజీవి 61వ జన్మదిన వేడుకల పార్టీ ఒకటి జరిగింది.

ఈ పార్టీకి మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా విచ్చేసింది. అయితే అక్కడున్నంత సేపూ.. చెర్రీ వైఫ్ ఉపాసన.. అండ్ బన్నీ వైఫ్ స్నేహ రెడ్డితో నమ్రత భలే టైమ్ స్పెండ్ చేసిందట. అదిగో, ఆ ఇద్దరి చేతులను కలిపేసి.. తాను కూడా ఒక చెయ్యేసి.. నమ్రత ఎంత జోవియల్ గా ఎంజాయ్ చేసిందట. అందుకు తగ్గట్టు ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఇదే విషయాన్ని షేర్ చేసిన ఉపాసన.. అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు అంటూ కామెంట్ కూడా చేసింది. అంతటితో వదిలిపెట్టలేదు. వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల్ అని కూడా చెప్పింది. ఇంతకీ ఈ శ్రీయ ఎవరంటే, అక్కినేని అఖిల్ ప్రేమలో పడ్డాడు కదా, ఆ అమ్మాయేనట.

English summary

3 amazing wives gave pose for photo