న్యూ లుక్ కోసం భారీ ఖర్చు కి సిద్ధం

3 Crore Set For Janata Garage

03:02 PM ON 19th February, 2016 By Mirchi Vilas

3 Crore Set For Janata Garage

‘నాన్నకు ప్రేమతో’ సక్సస్ ట్రాక్ ను కొనసాగించడానికి జూనియర్ ఎన్టీఆర్ బలంగా నిర్ణయించుకున్నాడట. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ ఈనెల 22 నుంచి ప్రారంభిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టకుండానే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తున్న ఈసినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో గడ్డంతో డిఫరెంట్ లుక్ తో కనిపించిన జూనియర్ ఈసినిమాలో మాత్రం మళ్ళీ తన పాత లుక్ లోనే కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాకు సంబంధించి ఒక ఆశక్తికరంగా సారధి స్టూడియోస్ లో దాదాపు 3 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి భారీ సెట్ నిర్మాణం దాదాపు పూర్తయిందన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పని చేసే గ్యారేజ్ ని సహజంగా ఉండేలా భారీ సెట్ వేసారట.. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని ఈ సెట్ చూసిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నట్టు టాక్. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ డిజైన్ చేసిన ఈ సెట్లో సహజత్వానికి అనుగుణంగా ఉండటానికి ఇప్పుడు 15-20 పాత కార్లను గ్యారేజ్ లో చేర్చే పనిలో ఈ యూనిట్ సభ్యులు పడ్డారట.

ఈ కథలో ఓ కీలకమైన మలుపు తిప్పబోయే పాత్రగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర ఉంటుందని, పైగా అది ఇంటర్వెల్ కు ముందు వస్తుందని అక్కడ నుంచి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్ ని లీడ్ చేస్తుందని కలరింగ్ ఇస్తున్నారు. మొత్తానికి మాస్ లుక్ తో ఎన్టిఆర్ ని రీ ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఈసినిమా ఉంటుందని , ఇక మోహన్ లాల్ వుంటే, ఎంతోకొంత ట్విస్ట్ కూడా సహజంగా ఉంటుందని అంటున్నారు.

English summary

Young tiger NTR's upcoming film Janata Garage shooting was going in Saradhi studious in Hyderabad.In saradhi studious three Three crore expensive set has been built Mythri Movie Makers for the movie.Koratala Shiva was the director of that movie.