నిహారిక 'ఒక మనసు' నష్టం ఎంతో తెలుసా?

3 crores loss for Oka Manasu movie

03:25 PM ON 21st July, 2016 By Mirchi Vilas

3 crores loss for Oka Manasu movie

మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ తో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నిహారిక హీరోయిన్ అవ్వడం ఇష్టం లేకపోయినా ఆమె కోసం మెగా హీరోలు కదిలి వచ్చి ఆమెకు మద్దతు పలికారు. ఆమె నటించిన 'ఒక మనసు' చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ ఆమెను ఆశీర్వదించారు. ఆమె హీరోయిన్ గా రావడం ఇష్టం లేని మెగా ఫ్యాన్స్ కూడా ఆమెకు సక్సెస్ దక్కాలని కోరుకున్నారు. అయితే నిహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు తీవ్రంగా నిరాశ పర్చింది. నిహారికకు నటిగా మంచి మార్కులు పడ్డా కూడా ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు దాదాపు మూడు కోట్లు నష్టపోయారు.

రామరాజు దర్శకత్వంలో టీవీ9తో కలిసి ఈ సినిమాను మధుర శ్రీధర్ నిర్మించిన విషయం తెలిసిందే. క్లాస్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. దాంతో ఈ సినిమాకు మొదటి రోజు నుండే కలెక్షన్స్ పడిపోయాయి. పూర్తిగా రెండు రోజులు కూడా థియేటర్ల వద్ద జనాలు కనిపించలేదు. దాంతో విడుదలైన అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా వారం కూడా ఆడలేదు. డిస్ట్రిబ్యూటర్లు మెగా మూవీ అనే నమ్మకంతో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశారు. కాని తీరా ఈ సినిమా కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చింది. మొత్తంగా ఈ సినిమా అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు కలిసి 3 కోట్లు నష్టం చూపించింది.

English summary

3 crores loss for Oka Manasu movie