3కోట్లతో ‘భాగమతి’ భారీ సెట్!

3 Crores Set For Anushka New Project Bhagmati

11:20 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

3 Crores Set For Anushka New Project Bhagmati

భారీ సినిమాల మోజు బానే పెరిగిపోతోంది. ఇప్పుడు అనుష్క న్యూప్రాజెక్ట్ ‘భాగమతి’ గురించి ఇలాంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోలోని సుమారు మూడు కోట్లతో ఓ సెట్ రెడీ చేస్తున్నట్టు టాక్. నైజాం కల్చర్ నే కాకుండా, తమిళ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నారట. ఆర్ట్ డైరక్టర్ రవీందర్ దీన్ని అందంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. కోట్లాది రూపాయల సెట్ కావడంతో హిస్టరీ నేపథ్యమున్న స్టోరీ కాదని సోషల్ డ్రామా అని డైరెక్టర్ అశోక్ చెబుతున్నాడు .

అనుష్కకు జోడీగా సరైనోడు విలన్ ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. విలన్ గా మళయాళ నటుడు జయరామ్ నటిస్తున్నాడు. బాహుబలి2 షూట్ తర్వాత ఈ సెట్ కి అనుష్క రానుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ కి తీసుకురావాలని యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి రుద్రమ దేవి తర్వాత మరో భారీ మూవీ అనుష్క చేస్తోందన్న మాట.

ఇది కూడా చూడండి: బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

ఇది కూడా చూడండి: ఆ గుడిలోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్తే రాయి ఐపోతారట... ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా

ఇది కూడా చూడండి: బ్రూస్ లీ మరణం వెనుక రహస్యం

English summary

3 Crores Set For Anushka New Project Bhagmati. Bhagmati is an upcoming Telugu movie written and directed by G. Ashok. In this film Anushka Shetty and Aadhi Pinisetty in the lead roles.