ఎన్నికల వేళ  వెండి పట్టీలు

3 Lakh Worth Silver Caught In Tamilnadu

09:50 AM ON 18th March, 2016 By Mirchi Vilas

3 Lakh Worth Silver Caught In Tamilnadu

ఎన్నికల కాలం వచ్చిందంటే, ఎన్ని హామీలో , ఎన్ని తాయిలాలో , ఎన్నికల అధికారులకు దొరక్కుండా ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. లేకపోతె విజయం రాదని భావన. ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైన నేపథ్యంలో ఓటర్లకు ఎరలు వేసేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అని తహతహ లాడిపోతున్నారు. తాజాగా తమిళనాడులో వెండి పట్టీలు దొరికాయి. అంటే అదేదో రోడ్డు మీద ఎవరో పారేసుకున్న ఒకటో రెండో జతలు కాదు. ఏకంగా100 జతల వెండి పట్టీలు పట్టుబడటంతో ఎన్నికల సంఘం దీనిపై సీరియస్ గా స్పందిస్తోంది. ఎన్నికల సమయంలో పంచడానికే వీటిని తయారు చేసి ఉంటారని భావిస్తున్నట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ లఖోని చెప్పారు. సేలం జిల్లాలోని ఓ డీఎంకే సభ్యుడి ఇంట్లో వీటిని గుర్తించినట్లు చెప్పారు. ఆరు కేజీల బరువున్న వెండి పట్టీల ప్యాకెట్లు అక్కడ పట్టుబడ్డాయన్నారు. పట్టీలతోపాటు డీఎంకే నాయకులు కరుణానిధి, స్టాలిన్‌ల ఫోటోలు ఆ ప్యాకెట్లలో ఉన్నాయని చెప్పారు. వీటి విలువ రూ.3లక్షల వరకు ఉంటుందన్నారు. అంటే మహిళా ఓటర్లకు వెండి పట్టీలు ఎరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్న మాట. ఇది మాత్రమే కాదు, ముందు ముందు మరిన్ని తాయిలాలు విసరడానికి అన్ని పక్షాలు సిద్ధంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

దూకేస్తే ఏమౌద్దంటూ దూకేసిన హంసా

రానా దగ్గరుంటే కంట్రోల్‌ చేసుకోలేదట..

స్మార్ట్ ఫోన్ ను ఇలా కూడా వాడుకోవచ్చా..

ఆయన నాలుక కోసి తెస్తే రూ కోటి ఇస్తా

మగువలు పడిచచ్చే సెక్స్ భంగిమలు ఇవే

English summary