ట్రంప్ ని దించేందుకు ముగ్గురు సింగర్స్ ఏమి చేస్తున్నారో తెలుసా?

3 pop singers are against Donald Trump

12:36 PM ON 14th November, 2016 By Mirchi Vilas

3 pop singers are against Donald Trump

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ఈ పిటీషన్ పై సంతకాలు సేకరించడానికి పాప్ సింగర్లు లేడీగాగా, పింక్, సియాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. ట్రంప్ ను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా అంగీకరించవద్దని తమ అభిమానులకు పిలుపునిచ్చారు. ట్రంప్ ఎన్నికకు వ్యతిరేకంగా ఓ పిటిషన్ పై 30 లక్షల మంది సంతకాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 19న అన్ని రాష్ట్రాల ఓట్లను రద్దు చేయాలని, వాటిని హిల్లరీ క్లింటన్ ఖాతాలో జమచేయాలని ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లను పిటిషన్లో కోరారు.

ఈ పిటిషన్ పై సంతకం చేయాలని కోరుతూ లేడీ గాగా తన అభిమానులను ట్విట్టర్ ద్వారా అభ్యర్థించింది. డిసెంబరు 19న ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు హిల్లరీ క్లింటన్ ను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని కోరుతూ పిటిషన్ పై సంతకం చేయండి అని పింక్ ట్వీట్ చేసింది. అమెరికాను పాలించే అర్హత ట్రంప్ కు లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అనుభవలేమి, సెక్స్ ఆరోపణల చరిత్ర ఉన్న ట్రంప్ రిపబ్లికన్లకు ప్రమాదకరమని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

English summary

3 pop singers are against Donald Trump