సిరంజితో యాసిడ్ ఎక్కించి ఇల్లాలిని చంపేసిన ప్రియురాలు

3 women killed 1 house wife with acid

03:16 PM ON 27th April, 2016 By Mirchi Vilas

3 women killed 1 house wife with acid

మర్డర్ చేయడం రోజు రోజుకీ సులువు అయిపోయింది... పరిష్కరించుకోలేని విధంగా సమస్యలను తయ్యారు చేసుకుని చివరకు హత్యలకు ఒడిగడుతున్నారు. ఇందులో ఆడాళ్ళకు మినహాయింపు లేనేలేదు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఓ సారి పరిశీలించండి. వివాహేతర సంబంధాలు ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తున్నాయని గుంటూరు జిల్లా చీరాలలో తాజాగా జరిగిన ఓ దారుణం రుజువు చేసింది. చీరాల ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన ఇలియాజ్‌ అనే వ్యక్తికి చీరాల, గుంటూరుల్లో చికెన్‌ షాపులున్నాయి. దుకాణం పని మీద గుంటూరు వెళ్లే ఇలియాజ్‌కు అక్కడ వహీదా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం ఇలియాజ్ భార్య హసీనాకు తెలియడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారి తీసింది. పైగా, ఫోనులో వహీదాను హసీనా తిడుతూ వచ్చింది. ఈ తిట్లు భరించలేదని వహీదా.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసింది. ప్లాన్ అమల్లో పెట్టేసింది. ఇద్దరు మహిళలను తీసుకుని మంగళవారం చీరాలకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇలియాజ్‌ ఇంటికి వెళ్లింది. ఇద్దరు మహిళలు హసీనాను గట్టిగా పట్టుకోగా మరొకరు సిరంజిలో యాసిడ్‌(బంగారాన్ని శుద్ధి చేయడానికి వాడే ద్రావణాన్ని) ఎక్కించి హసీనా మెడ పైన, చేతి పైనా ఇంజెక్షన్‌ చేశారు.

ఆ దృశ్యాన్ని చూసిన హసీనా పిల్లలు కేకలు వేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ముగ్గురినీ పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. అస్వస్థతకు లోనైన హసీనాను స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు రంగంలో దిగి వహీదాను, ఆమెతో పాటు వచ్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary

3 women killed 1 house wife with acid