మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

30 Crore Remuneration For Chiranjeevi 150th Movie

09:50 AM ON 5th May, 2016 By Mirchi Vilas

30 Crore Remuneration For Chiranjeevi 150th Movie

మెగాస్టార్ చిరంజీవి మూవీ గురించి కొత్త గాసిప్. తక్కువ బడ్జెట్‌లో సినిమాని తెరకెక్కించాలని చిరు తనయుడు,నిర్మాత రామ్‌చరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి లొకేషన్స్ ఎంపిక దాదాపు పూర్తయినట్టు టాక్ కూడా నడుస్తోంది. ఇక నటీనటుల ఎంపిక కాగానే సెట్స్‌పైకి వెళ్లాలని డైరెక్టర్ వివి వినాయక్ స్కెచ్ వేశాడు. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో చిన్న చర్చ స్టార్ట్ అయింది. అదేమంటే, ఈ ఫిల్మ్ కోసం చిరంజీవి తన రెమ్యునరేషన్‌గా 30 కోట్లు తీసుకున్నట్లు టాక్. హీరోలు కోట్లకు కోట్లు తీసుకుంటే లేదుగానీ, చిరుకి 30 కోట్లు అదేమంత ఎక్కువ కాదని ఆయన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ చెబుతున్నమాట. అంతా బానేవుంది.. ఒక్క చిరంజీవికే 30 కోట్లు ఇస్తే.. హీరోయిన్, మిగతా నటీనటులు, ప్రొడక్షన్ కాస్ట్ ఎలా చూసినా బడ్జెట్ 60 కోట్లు దాటిపోవడం ఖాయమని అంటున్నారు. మరి చిరు రీఎంట్రీ మూవీకి అయ్యే భారీ ఖర్చుకు కొణిదల ప్రొడక్షన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేక ఇది రూమర్‌గానే మిగిలిపోతుందా? మొత్తానికి చిరు మూవీ కనుక రకరకాల వార్తలు రావడం సహజం. మొత్తానికి ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

వధువు కనిపిస్తే హాయిగా ముద్దులు పెట్టుకోవచ్చట

చేసిన ప్రియుడిని తెలిమోసంవిగా కడతేర్చిన ప్రేయసి

ఈ వయసులో పెళ్ళి చేసుకుంటే విడాకులే

English summary

Mega Star Chiranjeevi 150th Movie was launched and this movie was going to Direct by V.V.Vinayak and to be Produced by Ram Charan in his own Film Banner named "Konidela Productions". Now a recent gossip that Chiranjeevi to take 30 Crore Huge remuneration to the movie.