విండోస్ 30 ఏళ్ళ ప్రస్థానం

30 Years of Windows

06:23 PM ON 21st November, 2015 By Mirchi Vilas

30 Years of Windows

మూడు దశాబ్దాల క్రితం వ్యక్తిగత కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చి విప్లవాత్మక మార్పులు తెచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థ వారి విండోస్ ఆపరేటింగ్ సిస్టంకు ఈ రోజుతో సరిగ్గా 30 ఏళ్ళు నిండాయి.

తన మొదటి విండోస్ వెర్షన్ 1.0 ను తొలిసారిగా నవంబర్ 20, 1985 న ప్రపంచ మార్కెట్లోకి తొలిసారిగా ప్రవేశపెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వివిధ అప్ డేట్లతో అప్ డేట్ చేస్తూ విజయవంతంగా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది బిల్ గేట్స్ యొక్క మైక్రోసాఫ్ట్ సంస్థ.

మైక్రోసాఫ్ట్ సంస్థ తన మొదటి విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వివిధ కామండ్ల ఆధారంగా పని చేసేటట్లుగా రూపోందింది. ఆయితే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కు ఆదరణ పెరుగుతుండడంతో తన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కలిగిన ఆపరేటింగ్ సిస్టంను తన 3.0 వెర్షన్ గా మార్కెట్లోకి విడుదల చేయగా దాదాపు 10 మిలియన్ల కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించాయి.

2001వ సంవత్సరం లో మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన విండోస్ ఎక్స్ పి ఆపరేటింగ్ సిస్టం కంప్యూటర్ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఈ వెర్షన్ లో పర్సనల్ వెర్షన్ , బిజినెస్ వెర్షన్ లతో విడుదల చేసారు. వైర్ లెస్ డివైస్ సపోర్ట్ , రిమోట్ డెస్క్ టాప్ సర్విస్ వంటి వివిధ ప్రత్యేకతలను ఇందులో పొందుపరిచారు .

విండోస్ ఎక్స్ పి తరువాత విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో వచ్చిన ప్రధాన అప్ డేట్ 2009 లో వచ్చిన విండోస్ 7. అనేక చేర్పులు మార్పులతో, అనేక ఫీచర్లతో , సరికొత్త ఇంటర్ఫేస్ తో ఈ వెర్షన్ అందరిని ఆకట్టుకుంది.

విండోస్ 7 తరువాత వచ్చిన విండోస్ 8 ను 2012 లో విడుదల్ చేసారు. ఈ ఆపరేటింగ్ సిస్టంలో లైవ్ టైల్స్ ,టచ్ స్క్రీన్ టెక్నాలజీ లను ప్రవేశపెట్టింది.

తాజాగా 2015 లో తన నూతన వెర్షన్ విండోస్ 10 విడుదల చేసింది. ఈ వెర్షన్ లో కార్టోనా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి అత్యాధునిక ఫీచర్ల తో విడుదల చేసారు.

రాబోయే కాలంలో అనేక కొత్త కొత్త వెర్షన్లు , ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు సాగిపోనుంది.

English summary

The PC revolution started off life 30 years ago this week. Microsoft launched its first version of Windows on November 20th, 1985, to succeed MS-DOS. It was a huge milestone that paved the way for the modern versions of Windows we use today