'బాహుబలి 2' కోసం జిమ్ లో బిజీ అయిన కమీడియన్

30 years Prudhvi busy in gym

06:04 PM ON 21st January, 2016 By Mirchi Vilas

30 years Prudhvi busy in gym

30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ ఇదివరకు చిన్నచిన్న పాత్రలలో నటిస్తూ కాలం గడిపేవాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ లో టాప్‌ కమీడియన్ల లిస్ట్‌లో చేరిపోయాడు. గత కొద్ది రోజులుగా ఆలీ, బ్రహ్మనందాల హవా తగ్గడంతో పృధ్వీ కి అవకాశాలు పెరిగాయి. వచ్చిన ఏ అవకాశాన్ని చేజారనివ్వకుండా బిజీ అయిపోతున్నాడు పృధ్వీ. అంతేకాకుండా ఇతని కోసం రచయితలు ప్రత్యేకమైన క్యారెక్టర్లు రాస్తున్నారు. అవకాశాలు పెరగడంతో పృధ్వీ కూడా ఫిట్‌నెస్‌ పై దృష్టి పెడుతున్నారని సమాచారం. జిమ్‌ కు వెళ్ళి బాగా కష్టపడుతున్నాడట. పృధ్వీకి రాజమౌళి 'బాహుబలి -2' లో ఒక పెద్ద ఆఫర్‌ ఇచ్చాడనే వార్తలు వినిపించాయి.

కానీ ఈ విషయం ఎవరూ స్పష్టం చేయలేదు. అయితే మునుపెన్నడూ లేని విధంగా పృధ్వీ కసరత్తులు చేయడం చూసి 'బాహుబలి -2' కోసమే పృధ్వీ ఇంతగా కష్టపడుతున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో కూడా విడుదలైంది. మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Comedian 30 years Prudhvi is busy in gym for 'Baahubali 2' movie. He is doing fitness workout for his body.