రేటు పెంచేసిన '30 ఇయర్స్‌ పృధ్వి'!!

30 years Prudhvi increased his remuneration

04:38 PM ON 30th December, 2015 By Mirchi Vilas

30 years Prudhvi increased his remuneration

కమీడియన్‌ పృధ్వి సినీ పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు చాలా సంవత్సరాలు అయింది. అయితే సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అప్పుడెప్పుడో రవితేజ నటించిన 'ఖడ్గం' సినిమాలో '30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ' అనే డైలాగ్‌తో పాపులర్‌ అయినా ఆ తరువాత సరైన అవకాశాలు రాక నిలదొక్కుకోలేకపోయాడు. అయితే 2014 లో గోపీచంద్‌ నటించిన 'లౌక్యం' చిత్రంలో 'డింబు' పాత్రలో కామెడీని ఓ రేంజ్‌లో పండించి పాపులర్‌ అయ్యాడు. తాజాగా విడుదలైన బెంగాల్‌ టైగర్‌, సౌఖ్యం, భలేమంచి రోజు చిత్రాల్లో కూడా అదిరిపోయే కామెడీని పండించి మోస్ట్‌ వాంటెడ్‌ కమీడియన్‌గా మారిపోయాడు.

తన డిమాండ్‌ పెరగడంతో ఇది వరకు సినిమాకి 25 నుండి 40 వేలు తీసుకునే పృధ్వి ఇప్పుడు ఏకంగా 1.5 లక్షలు పారితోషికం అడుగుతున్నాడట. పేక్షకుల్లో పృధ్వి డిమాండ్‌ కూడా పెరగడంతో నిర్మాతలు కూడా అంత పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని సమాచారం. మరి పృధ్వి ఈ క్రేజ్‌ ఎంత వరకు కొనసాగిస్తాడో ముందు ముందు ఎంత పారితోషికం తీసుకుంటాడో చూడాలి.

English summary

30 years Prudhvi increased his remuneration.