కృష్ణా పుష్కర నిధులు రూ. 313.27 కోట్లు

313 Crores Released For Krishna Pushkaralu

11:49 AM ON 17th March, 2016 By Mirchi Vilas

313 Crores Released For Krishna Pushkaralu

వచ్చే ఆగస్టు 12నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలకు సంబంధించి జిల్లా కలెక్టర్‌ పంపించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కలెక్టర్‌ బాబు ఒక ప్రకటన చేస్తూ తాము ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. క్షేత్ర స్థాయిలో పనులను కూడా ప్రారంభించనున్నట్లు తెల్పారు. కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ రూ.73.90 కోట్లు, ఇరిగేషన్ శాఖ రూ.173.30 కోట్లు, ఆర్‌ అండ్‌ బి శాఖ రూ.50 కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌ రూ.10.24 కోట్లు, జిల్లా పంచాయతీ రాజ్‌ అధికారి రూ.6.13 కోట్లు చొప్పున ప్రతిపాదనలు చేశాయని, డిస్కమ్‌, తదితర శాఖలు ప్రతిపాదించిన మేరకు పనులు ప్రారంభించనున్నామని, అవసరమైతే అదనపు నిధులను కూడా సమీకరించుకుంటామని కలెక్టర్ వివరించారు.

ఆగస్టు 12నుంచి కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కర సన్నాహాలు - 22 పుష్కర నగర్ లు

English summary

Andhra Pradesh Government Has sanctioned 313.27 crores amount for upcoming Krishna Pushkaralu.Krishna Pushkaralu was going to be start from August 12th.Krishna District collector Said that Krishna Pushkaralu will be conducted in a grand manner.