పోస్టాఫీసుల్లో డిపాజిట్ ఎంతయిందో తెలిస్తే షాకవుతాం

32 Thousand Crores Deposited in Post Offices

01:19 PM ON 28th November, 2016 By Mirchi Vilas

32 Thousand Crores Deposited in Post Offices

పాత నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులెలా వున్నా, పన్నుల వసూళ్లతో మున్సిపాల్టీలు, పంచాయితీల గళ్ళా పెట్టెలు నిండాయి. ఇక పోస్టాఫీసులకు మహర్దశ పట్టింది. ఈనెల 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న అనంతరం పోస్టాఫీసుల్లో ఇంతవరకూ డిపాజిట్ అయిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.32,631 కోట్లు. దేశంలోని 1.55 లక్షల పోస్టాఫీసుల్లో ఈ మొత్తం డిపాజిట్ అయినట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ సెక్రటరీ బీవీ సుధాకర్ తెలిపారు. ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకూ ఈ మొత్తం డిపాజిట్ అయిందని, రూ.3.680 కోట్ల విలువైన కరెన్సీ నోట్ల మార్పిడి చేశామని తెలిపారు. డిపాజిట్లుగా తీసుకున్న పాత 500, 1000 నోట్ల విలువ సుమారు 32,631 కోట్లు ఉంటుందని ఆయన వివరించారు. దేశంలోని మొత్తం పోస్టాఫీసుల్లో 1.30 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో, 25 వేల బ్యాంకులు పట్టణ, సెమీ అర్బన్ ఏరియాల్లో ఉన్నాయన్నారు. కాగా, ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకూ పోస్టాఫీసుల నుంచి విత్ డ్రా అయిన సొమ్ము రూ.3,586 కోట్లని సుధాకర్ వెల్లడించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత పోస్టాఫీసుల్లోనూ నిర్దిష్ట పరిమితికి లోబడి పాత నోట్లు మార్చుకునే సౌకర్యం కల్పించారు. పోస్టల్ సేవింగ్ అకౌంట్ లేకపోయినప్పటికీ గుర్తింపు కార్డులు చూపించి పాత నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఈనెల 24వ తేదీతో పాత నోట్ల ఎక్స్ఛేంజ్ గడువు అటు బ్యాంకులు, ఇటు పోస్టాఫీసుల్లో ముగిసిపోయింది. అయితే, డిసెంబర్ 30 వరకూ బ్యాంకుల్లో పాత నోట్లు డిపాజిట్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:కొత్త 500 నోట్ల కొరతపై వాస్తవం చెప్పిన ఆర్బిఐ

ఇవి కూడా చదవండి:శబ్దాన్ని బట్టి దొంగ నోట్లను గుర్తించవచ్చట .. సిపి చెప్పిన కొత్త నోటు ఫీచర్లు

English summary

Due to the effect of Old Notes Cancelled by the Central Government so many people were exchanged their old currency in Post Offices and till now 32631 crores of ammount was credited in post offices all over the India till now.