బీసిసిఐకి 332 కోట్లు!! 

332 Crore Profit To BCCI

11:34 AM ON 10th December, 2015 By Mirchi Vilas

332 Crore Profit To BCCI

ఐపిఎల్‌ 2016 సీజన్ లో రెండు కొత్త టీంలు ఆడనున్నాయి. అవినీతి ఆరోపణలు కారణంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల పై కోర్టు నిషేదం విధించిన కారణంగా ఆ రెండు జట్లు తప్పుకోవడంతో పుణే, రాజ్‌కోట్‌ టీంలు వచ్చి చేరాయి.
పుణే జట్టును ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకా కంపెనీ 'న్యూరైజింగ్‌ ' వారు సొంతం చేసుకోగా, రాజ్‌కోట్‌ జట్టును ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఇంటెక్స్‌ వారు సొంతం చేసుకుంది.

ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు 2016, 2017 ఐపిఎల్‌ సీజన్‌లలో రెండేళ్ళ పాటు కొనసాగనున్నాయి. మిగిలిన ఆరు జట్లతో పాటు ఈ రెండు జట్లు కలిసి ఎప్పటిలాగే ఎనిమిది జట్లతో ఐపిఎల్‌ 2016 మన ముందుకు రానుంది.

సస్పెన్షన్‌ కు గురైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ , రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల లోని ఆటగాళ్ళను కొత్త జట్ల యాజమాన్యాలు చెరో ఐదుగురిని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. చెరో ఐదుగురి ఆటగాళ్ళను తీసుకున్న తరువాత మిగిలిన ఆటగాళ్ళకు వేలం నిర్వహిస్తారు. ఈ ఆటగాళ్ళ వేలంలో ఒక్కో జట్టు 40 కోట్ల నుండి మొదలకుని 66 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ కొత్త జట్ల చేరికతో బీసిసిఐ భారిగా లాభ పడనుంది. ఐపిఎల్‌ ప్రతి ఫ్రాంచైజీ ఏడాదికి 70 కోట్లు చెల్లిస్తాయి. దీనితో పాటు ఈ రెండు కొత్త జట్ల యాజమాన్యాలు సంవత్సరానికి చెరో 13 కోట్ల అంటే 26 కోట్లను ఐపిఎల్‌ బోర్డుకు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 166 కోట్ల ఆదాయం చొప్పున రెండేళ్ళకు 332 కోట్ల ఆదాయం క్రికెట్‌ బోర్డుకు వస్తుంది. దీనితో భారత క్రికెట్‌ బోర్డు (బిసిసిఐ) కు భారిగా మొత్తంలో ఆదాయం వచ్చినట్లే.

English summary

BCCI to get huge profit of 332 crores for the next ipl season .Two new teams were added in the place of chennai super kings and rajasthan royals