మహేష్.. విజయ్ లతో 350 కోట్లతో సినిమా!

350 crores budget for Mahesh Babu and Vijay's movie

11:28 AM ON 4th July, 2016 By Mirchi Vilas

350 crores budget for Mahesh Babu and Vijay's movie

మల్టీ స్టారర్ మూవీస్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. బాహుబలి, ఊపిరి ఇలా పలు సినిమాలు ఇప్పటికే హల్ చల్ చేస్తున్నాయి. ఇక మహేష్ బాబు-విజయ్ ల గురించి ఓ కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది. స్టార్ హీరోలతో కలిపి ఓ సినిమా చేయాలని తమిళ డైరెక్టర్ సుందర్.సి ప్లాన్ చేస్తున్నాడని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల టాక్. బడ్జెట్ కూడా దాదాపు 350 కోట్ల రూపాయలని అంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా వున్నా, భారీ బడ్జెట్ అంటే అంతే కదా. ఇక కాస్టింగ్ కూడా ఆ రేంజ్ లో ఆలోచన చేస్తున్నట్లు టాక్. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, కళా దర్శకుడు సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్ కణ్ణన్ వంటి హేమాహేమీలు దీనికి పని చేయనున్నారని టాక్ నడుస్తోంది.

అయితే ఇదంతా మల్టీస్టారర్ మూవీ మాత్రం కాదట. తెలుగు వెర్షన్ లో మహేష్బాబు, తమిళంలో విజయ్, హిందీలో మరొకరు. ఇలా మూడు వెర్షన్స్ కలిసి దాదాపు 350 కోట్లు అవుతుందన్నది డైరెక్టర్ ఆలోచన. ఒక వెర్షన్ కాకపోయినా మరొకటైనా హిట్ అవుతుందని అంటున్నారు. మరి హీరోలు ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారా లేదా అనేది సస్పెన్స్. తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ దీన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోందట. ఆ సంస్థకు ల్యాండ్ మార్క్ అంటే 100వ మూవీ కావడమేనని తెలుస్తోంది. అంతా ఓకే అయితే సౌత్ లో ఇదో సంచలనంగానే చెన్నై ఫిల్మ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా? గాసిప్స్ గా మిగిలిపోతుందా అనేది త్వరలోనే తేలిపోతుంది.

English summary

350 crores budget for Mahesh Babu and Vijay's movie