15నిమిషాల్లో 35 వేల ఫోన్లు సేల్ - లెనోవో కే6 పవర్ స్మార్ట్ ఫోన్ సంచలనం

35000 Lenovo K6 Power Smartphones Sold In Just 15 Minutes

10:54 AM ON 14th December, 2016 By Mirchi Vilas

35000 Lenovo K6 Power Smartphones Sold In Just 15 Minutes

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు లేరనే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇక ఆయా నెట్ వర్క్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లు, ముఖ్యంగా జియో నెట్ వర్క్ బంపరాఫర్ చూసాక ఇంచుమించు అందరి చేతుల్లో స్మార్ట్ కనిపిస్తోంది. ఈక్రమంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లెనోవో తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ‘కే6 పవర్’ స్మార్ట్ ఫోన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఓపెనింగ్ సెకెండ్ సేల్ లో 15 నిమిషాల్లోనే ఏకంగా 35 వేల ఫోన్లు అమ్ముడుపోయినట్టు ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వారం రోజుల్లో 17 లక్షల మంది ఈ ఫోన్లు కొనేందుకు ప్రయత్నించినట్టు పేర్కొంది. కాగా ‘కే6 పవర్’ విక్రయాల కోసం ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న లెనోవో ఈనెల 18 నుంచి 21 వరకు మూడోసారి విక్రయాలకు సిద్ధమవుతోంది.

ఫీచర్లు చూస్తే, కే6 పవర్ స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా మెటల్ బాడీతో డిజైన్ చేశారు. 5 అంగుళాల హై డెఫినిషన్ టచ్ స్క్రీన్, డాల్బే అట్మాస్ సౌండ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఓఎస్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ధర రూ.9,999 మాత్రమే.

ఇవి కూడా చదవండి: పేస్ బుక్ లో చర్చ జరిగిన టాప్ పది అంశాలివే

ఇవి కూడా చదవండి: వాట్సాప్ లో కొత్తగా రెండు ఫీచర్స్!

English summary

Now a days smart Phones became essential thing in our daily routine life and now recently Chinese Smart Phone Company Lenovo associated with E-commerce Store Flipkart and Lenovo's New Smart Phone Named Lenovo K6 Power. 35000 Lenovo K6 smartphones was soled in Just 15 minutes.