యాంకర్ హిడన్ వీడియో కి 370 కోట్లు పరిహారం!!

370 crores Compensation for Erin Andrews hidden cam video

03:46 PM ON 9th March, 2016 By Mirchi Vilas

370 crores  Compensation for Erin Andrews hidden cam video

ఆ మహిళా యాంకర్ కి జరిగిన నష్టానికి ఒకటా రెండా ఏకంగా 370కోట్ల రూపాయల పరిహారం అందించాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇంత భారీ మొత్తాన్ని పరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో అసలు ఈ కథా కామామిషు ఏమిటో తెల్సుకోవాల్సిందే. ఆ మధ్య ఓ మహిళా యాంకర్ దుస్తులు మార్చుకుంటుండగా తీసిన వీడియో సీక్రెట్ విషయం అది. వివరాల్లోకి వెళితే, అమెరికా ఛానెల్ యాంకర్ ఎరిన్ ఆండ్రూస్ 2008లో ఈఎస్పిఎన్ ఛానెల్ లో పనిచేస్తున్నప్పుడు ఓ ఫుట్బాల్ మ్యాచ్ కవర్ చేయడానికి వెళ్ళింది. అమెరికా వాండర్ బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్విల్లే హోటల్ లో బస చేసింది.

ఆ సందర్భంగా రూమ్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు, మైఖేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఆ దృశ్యాన్ని రహస్యంగా వీడియో కెమెరాలో బంధించాడు. అంతేకాదు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఎరిన్ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఎత్తుగడ వేసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విమర్శలను భరించలేక ఎరిన్ కోర్టుని ఆశ్రయించింది. ఎనిమిదేళ్ళ పాటు సాగిన విచారణ అనంతరం ఎరిన్ కి ఊరట లభించడమే కాదు ఇన్నాళ్ళూ ఎరిన్ అనుభవించిన మానసిక క్షోభ కు పరిహారంగా ఏకంగా 55 మిలియన్ డాలర్లు అంటే 370 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తానికి సంచలన తీర్పుతో 370 కోట్లు నష్ట పరిహారం కొట్టేసింది ఎరిన్... ఇక ఆమె ఆనందానికి అవదులే లేకుండా పోయింది.


English summary

370 crores Compensation for Erin Andrews hidden cam video. In 2008 one man uploaded in social media anchor Erin Andrews nude video.