కోకాకోలా ప్లాంట్ లో భారీగా దొరికిన కొకైన్.. దాని ఖరీదు తెలిస్తే దిమ్మతిరుగుద్ది..

370 kilos Cocaine found in Coca Cola plant

11:42 AM ON 2nd September, 2016 By Mirchi Vilas

370 kilos Cocaine found in Coca Cola plant

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే సాఫ్ట్ డ్రింక్స్ లో కోకాకోలా నెంబర్ 1 స్థానం ఆక్రమించింది అంటారు. మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో దీన్ని ఎక్కువగా సేవిస్తారు. ఫ్రాన్స్ లోని ఓ కోకాకోలా ప్లాంట్లో ఏకంగా 370 కిలోల కొకైన్ బయటపడింది. దీంతో ఈ వార్త ఫ్రాన్స్ లో కలకలం సృష్టిస్తోంది. దక్షిణ ఫ్రాన్స్ లోని సైనెస్ వద్ద గల కోకాకోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న ఈ కొకైన్ ని అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్ లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.

దీని విలువ 50 మిలియన్ యూరోలు(దాదాపు 372 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొకైన్ వ్యవహారంలో కోకాకోలా ప్లాంట్ లో పని చేసే వర్కర్స్ పాత్ర లేదని తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని విచారణ అధికారి జీన్ డెనిస్ మల్గ్రాస్ వెల్లడించారు. కొకైన్ ను ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కూల్ డ్రింక్స్ తాగొద్దని, అందులో పెస్టిసైడ్స్ కలిపేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా కొకైన్ వ్యవహారం ఆరోపణదారులకు అస్త్రంగా మారిందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ పై సెలెబ్రిటీలు షాకింగ్ కామెంట్స్...

ఇది కూడా చదవండి: మద్యం మత్తులో ఆమె బాయ్ ఫ్రెండ్ ని ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు

English summary

370 kilos Cocaine found in Coca Cola plant. Huge amount of Cocaine was found in Coca Cola plant.