ఫేస్‌బుక్‌లో 3డీ టచ్‌ ఫీచర్

3D Feature In Facebook

04:29 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

3D Feature In Facebook

ప్రముఖ సామాజిక వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌.. 3డీ టచ్‌ పేరుతో సరి కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఫేస్ బుక్ టైం లైన్‌ని 3డీలోకి మార్చనుంది. ముందుగా యాపిల్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. వెబ్‌ లింక్స్‌, ప్రొఫైల్స్‌, పేజెస్‌, గ్రూప్స్‌, ఈవెంట్స్‌, ఫోటోస్‌, ఫ్రొఫైల్‌ పిక్స్‌ తదితరాలకు ఈ ఫీచర్‌ పనిచేస్తుందని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఐఓఎస్‌ వినియోగదారులు త్వరలోనే ఈ ఫీచర్‌ని చూడబోతున్నారని చెప్పారు. ప్రాథమికంగా కొంతమంది ఐఓఎస్‌ వినియోగదారుల టైం లైన్లలో ఈ ఫీచర్‌ని పరీక్షించి తర్వాత అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.

English summary

Facebook Timeline in 3D feature to come soon mobile users this feature will come to iOS users initially