3డీ టచ్ తో ఇన్ స్టాగ్రామ్

3D touch functionality in instagram

04:37 PM ON 9th December, 2015 By Mirchi Vilas

3D touch functionality in instagram

ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ మరికాస్త కొత్తగా మారనుంది. 3డీ టచ్ ఫంక్షనాలిటీని అందుబాటులోకి తెచ్చిన మొదటి యాప్ గా నిలవనుంది. ఇప్పటి వరకూ ఐఓఎస్ యాప్ వాడేవారికి మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు సైతం ఉపయోగించుకోవచ్చు. కొత్తగా ఇచ్చే అప్ డేట్లలో ఈ ఫీచర్ ను పొందుపరిచేందుకు ఇన్ స్టాగ్రామ్ కసరత్తు చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 7.12.1 లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందని ఆండ్రాయిడ్ పోలీస్ వెల్లడించింది. 3డీ టచ్ సహాయంతో మనం స్క్రీన్ పై గట్టిగా లేదా మెత్తగా టచ్ చేస్తే మనకు కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. ఇండియాలో తన యూజర్ల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఇన్ స్టాగ్రామ్ గత ఏడాది ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి తమ యూజర్ల సంఖ్య 400 మిలియన్లు దాటిందని, 80 మిలియన్ల చిత్రాలు ప్రతి రోజు షేర్ అవుతున్నాయని వెల్లడించింది.

English summary

Famous Social Photo Sharing app instagram introduced its new functionality called 3D touch functionality in its new update