అది ఇస్తావా లేక నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఇంట్లో చెప్పాలా అంటూ బెధిరింపు

4 cheaters blackmails 2 lovers in park

04:02 PM ON 28th April, 2016 By Mirchi Vilas

4 cheaters blackmails 2 lovers in park

ఓ యువతి బాయ్ ఫ్రెండ్ తో కలసి పార్క్ లో ఉన్న సమయంలో కొందరు యువకులు వీడియో తీసారు. సదరు వీడియో ఆ జంటకి చూపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే ఆ యువతి తన దగ్గర డబ్బులు లేవని ఏకంగా తన చెవికి ఉన్న బంగారపు పోగులు ఇచ్చేసింది. ఓసారి ఈ ఘటనలోకి వెళ్తే, రాజోలు పట్టణంలోని ఉన్న కాటన్ పార్కు కి ప్రేమికులు వస్తుంటారు. అయితే ఇలాంటి ప్రేమికులను టార్గెట్ చేసి.. వీడియో లు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు నలుగురు యువకులు. అలానే తాజాగా ఓ ప్రేమికుల జంట ఆ పార్క్ కి వచ్చిన సమయంలో.. వారి రొమాన్స్ ని ఆ యువకులు వీడియో తీసారు.

ఆ వీడియో ని వారికి చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ యువతి భయపడుతూ, తన దగ్గర డబ్బులు లేవని తన చెవికి ఉన్న బంగారపు పోగులు ఇచ్చేసింది. ఆ యువకుడిని కుడా బ్లాక్ మెయిల్ చేయడంతో.. అతను వారి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజోలుకి చెందిన మోసగాళ్లు చాలా కాలంగా ఇలానే అందరినీ వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడి అయింది. ఎవరెవరి వీడియోలు తీశారు అనే కోణంలో పోలీసులు వారి మొబైల్ ని స్వాదీనం చేసుకున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు బానే పెరిగిపోయాయి.

English summary

4 cheaters blackmails 2 lovers in park. 4 cheaters blackmails 2 lovers in park to give gold from the two lovers.